మెగా సందడి.. ఆనాటి నటులంతా ఒకచోట - MicTv.in - Telugu News
mictv telugu

మెగా సందడి.. ఆనాటి నటులంతా ఒకచోట

November 25, 2019

ఒకప్పుడు వారంతా సినీ ఇండస్ట్రీని తమ నటనతో ఏలినవారు. తమలో ఉన్న టాలెంట్ చూపించి అప్పటి స్టార్ డమ్ అలాగే కొనసాగిస్తున్న స్టార్స్. వీరిలో ఒక్కరు కనిపించినా అభిమానులకు పండగే. అదే వీరింతా ఒకే చోట కనిపిస్తే ఇంకా ఆ సందడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. 40 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ,కన్నడ,మలయాళీ వెండితెరను ఏలిన నటులంతా కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి.

Old Actress.

దీనికి మెగాస్టార్ చిరంజీవి ఇళ్లు వేదిక అయింది. 1980 – 90 దశకంలో వెండితెరపై మెరిసిన నటీ నటులు అంతా ఒక్క చోట చేసి సందడి చేశారు. ప్రతీ ఏటా ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో వీరంతా కలుస్తూ ఉంటారు. ఈ స్పెషల్ ఈవెంట్ వేర్వేరు ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ వేదికగా చిరంజీవి ఇంట్లో జరిగింది. ఆనాటి నటులంతా ఈ వేడుకకు వచ్చారు. ఆనాటి తీపి గుర్తులను మరోసారి ముచ్చటించుకున్నారు.తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఫంక్షన్ 10వ వార్షికోత్సవం చిరు ఇంట్లో నిర్వహించారు.  వీరందరినీ ఒకే ఫ్రేంలో బందించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.