రైలు ఎక్కొద్దని తుపాకులతో బెదిరిస్తున్నారు : భారతీయుులు - MicTv.in - Telugu News
mictv telugu

రైలు ఎక్కొద్దని తుపాకులతో బెదిరిస్తున్నారు : భారతీయుులు

March 3, 2022

06

ఉక్రెయిన్ ను వీడుతున్న భారతీయులు కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఖర్కీవ్ లో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..బుధవారం భారత ప్రభుత్వం భారతీయులందరూఖర్కీవ్ ను వీడాలని సూచించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఖర్కీవ్ లో చిక్కుకుపోయిన
భారతీయులు స్థానిక రైల్వే స్టేషన్ కు వెళ్లగా అక్కడ ఉన్న ఉక్రెయిన్ పోలీసులు భారతీయులను రైలెక్కకుండా అపేశారు.

అక్కడి పరిస్థితులపై ప్రగుణ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఓ వీడియోలో మాట్లాడుతూ‘రైల్వే స్టేషన్ లో మా ఎదురుగా ఓ రైలు ఉంది. కానీ అందులోకి మమ్మల్ని ఎక్కనీయడం లేదు. కేవలం ఉక్రెయిన్ పౌరులనే అనుమతిస్తున్నారు. ఇదేంటని అడిగితే కొడుతున్నారు. గాల్లో కాల్సులు జరుపుతున్నారు. ఆమ్మాయిలపై కూడా చేయి చేసుకుంటున్నారు. మేం దాదాపు వెయ్యి మంది దాకా ఉన్నాము. బాంబుల నుంచి కాపాడుకోవడానికి దగ్గరలో బంకర్లు కూడా లేవు. ఒకవేళ మాకేదైనా జరిగితే మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా’మని వివరించారు.