ధనాధన్ ఐపీఎల్ 10 సీజన్ ప్రేక్షకులకు మజా ఇస్తే క్రికెటర్లకు కోట్ల వర్షం కురిపించింది. ఇండియన్ క్రోర్ లీగ్ లో పెద్దగా రాణించని క్రికెటర్లు కోట్లు కోట్లు కొట్టేశారు. పరుగుకు నాలుగు లక్షల రూపాయలకు పైగానే అందుకున్నారు.
ఒక్కో క్రికెటర్ అందుకున్న మొత్తం.. చేసిన రన్స్ ఆధారంగా ఒక్కో పరుగుకు ఎంత సంపాదించారో బిజినెస్ టుడే ఓ లెక్కలేసింది. టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, ఎమ్మెస్ ధోనీ పెద్దగా రాణించింది లేదు కానీ డబ్బు మాత్రం బాగానే సంపాదించారు.గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్ మాత్రం తీసుకున్న డబ్బుకు కొద్దిగా న్యాయం చేశారు. ఆ లెక్కన ఈ సీజన్‌లో పెద్దగా రాణించని కోహ్లి, ధోనీలు ఒక్కో పరుగుకు రూ.4 లక్షలకుపైగా అందుకోవడం హైలైట్. ఇక పుణె సూపర్‌జెయింట్ మిలియన్ డాలర్ మ్యాన్ బెన్ స్టోక్స్ కూడా ఒక్కో పరుగుకు 4 లక్షలకుపైగా సంపాదించాడు.
ఒక్కో పరుగుకు లక్షలు…
ప్లేయర్ తీసుకున్నది ఇన్నింగ్స్ -పరుగులు ఒక్కో రన్ కు రూపాయలు
విరాట్ కోహ్లి 15 కోట్లు 10- 305 రూ.4,87,012
ధోనీ 12.5 కోట్లు 16-290 రూ.4,31,034
బెన్ స్టోక్స్ 14.5 కోట్లు 12-316 రూ.4,58,860
డివిలియర్స్ 9.5 కోట్లు 9-219 రూ.4,39,814
గంభీర్ 10 కోట్లు 16-498 రూ.2,00,803
రైనా 9.5 కోట్లు 14-442 రూ.2,14,932
ధావన్ 12.5 కోట్లు 14-479 రూ.2,60,960