రజనీ ఫంక్షన్  టికెట్ 4 లక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

రజనీ ఫంక్షన్  టికెట్ 4 లక్షలు..

October 23, 2017

అతను ఒకప్పుడు టికెట్, టికెట్ అంటూ బస్సులో టికెట్లు కొట్టే  ఓ మామూలు కండక్టర్. కానీ ఇప్పుడు ఆయన సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లాలంటే లక్షలు పెట్టి టికెట్ కొనాల్సిందే, అది.. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్. అతనే సూపర్‌స్టార్ రజనీ కాంత్. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ‘2.0’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యింది.

ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను దుబాయ్‌లో నిర్వహించబోతున్నారు. 12 కోట్ల రూపాయలతో దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత  ‘బుర్జ్ ఖలీఫా’ పార్క్‌లో ఆడియో ఫంక్షన్ భారీగా నిర్వహించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. రజనీకి ప్రపంచ మొత్తం క్రేజ్ ఉండడంతో ఆడియో ఫంక్షన్ టికెట్ ధరలు కూడా క్రేజీగానే ఉన్నాయి. ఆడియో ఫంక్షన్కు వెళ్లాలంటే ఒక్కో టికెట్ ధర 60 వేలు చెల్లించాలి. అదే విఐపి టికెట్స్ అయితే ఒక్కోటి 4 లక్షల రూపాయలకు అమ్మారు.  తలైవా మీదున్న అభిమానంతో ఎంత ఖర్చైనా పెట్టి వెళ్లేందుకు అభిమానులు వెనకాడడంలేదు. ‘2.0′ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం  అందించబోతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్, ఎఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో వస్తున్న ‘2.0’ సినిమా విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతోందో చూడాలె మరి.