2,345 పోస్టుల కు నోటిఫికేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

2,345 పోస్టుల కు నోటిఫికేషన్

August 28, 2017

రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగం అందుకుంది. టీఎస్‌పీఎస్సీ 2,345 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్ స్పెషాలిటీతో పీజీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, బీడీఎస్ చేసిన వారికి ఇది మంచి అవకాశం. అటవీ, వైద్య ఆరోగ్య, ఇన్సూరెన్స్ శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలోని అటవీ, వైద్య ఆరోగ్యశాఖ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,345 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేసింది.

– మొత్తం పోస్టుల సంఖ్య : 2345

– అటవీశాఖలో : 2014

– వైద్యశాఖ, ఇన్సూరెన్స్‌శాఖలో : 331

అటవీశాఖలో

– రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
– మొత్తం పోస్టుల సంఖ్య : 2014

– ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్-67, ఫారెస్ట్  సెక్షన్ ఆఫీసర్-90,  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-1857.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

– పాత జిల్లాల వారీగా ఖాళీలు-1857.  వీటిలో జనరల్ అభ్యర్థులకు-1230,  మహిళా అభ్యర్థులకు-627  పోస్టులను కేటాయించారు.
రిజర్వేషన్ల వారీగా :  ఓసీ (జనరల్-421, మహిళ – 224),  బీసీ ఏ (జనరల్ -63, మహిళ – 29),  బీసీ బీ (జనరల్ – 84, మహిళ- 54), బీసీ సీ (జనరల్ -12, మహిళ 2), బీసీ డీ (జనరల్ – 69, మహిళ -25),  బీసీ ఈ (జనరల్ – 41, మహిళ -13) , ఎస్సీ (జనరల్ -131, మహిళ – 64), ఎస్సీ – (జనరల్ -409, మహిళ – 216)

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు : హైదరాబాద్ & రంగారెడ్డి – 54, మహబూబ్‌నగర్ – 204 (జనరల్ – 154, ఏజెన్సీ – 50), నల్లగొండ – 97, నిజామాబాద్ – 176, మెదక్ – 116, ఖమ్మం – 274 (జనరల్ – 44, ఏజెన్సీ – 230), ఆదిలాబాద్ – 463 (జనరల్ – 337, ఏజెన్సీ – 126), వరంగల్ – 289 (జనరల్ – 151, ఏజెన్సీ – 138), కరీంనగర్ – 184.

– అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

– పేస్కేల్ : రూ. 16,400-49,870/-

శారీరక ప్రమాణాలు :

– పురుష అభ్యర్థులు – 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఛాతీ : 79 సెం.మీ. గాలి పీల్చినప్పుడు 84 సెం.మీ.వరకు వ్యాకోచించాలి.
– మహిళా అభ్యర్థులు – ఎత్తు 150 సెంటీమీటర్లు, ఛాతీ : కనిష్ఠంగా 79 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.

వాకింగ్ టెస్ట్ (నడక పరీక్ష)

– పురుషులు – 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో , మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో పూర్తిచేయాలి.

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, నడక పరీక్ష, మెడికల్ టెస్ట్

– ఆబ్జెక్టివ్ రాతపరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్ 1-100 మార్కులు, పేపర్ 2-100 మార్కులు) ఉంటాయి.

– పదోతరగతి స్థాయిలో జనరల్ నాలెడ్జ్ ( పేపర్ – 1), జనరల్ మ్యాథమెటిక్స్ (పేపర్ -2) అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.

– పరీక్ష కేంద్రాలు : పాత 10 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

– దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

– చివరితేదీ : సెప్టెంబర్ 12

– ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ : అక్టోబర్ 29

మెడికల్/ఇన్సూరెన్స్‌లో

– తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న సివిల్/డెంటల్ అసిస్టెంట్ సర్జన్, తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
– మొత్తం పోస్టుల సంఖ్య : 331 పోస్టులు

పోస్టులవారీగా వివరాలు

– సివిల్ అసిస్టెంట్ సర్జన్-205 పోస్టులు. వీటిలో జనరల్ అభ్యర్థులకు-92, మహిళా అభ్యర్థులకు-113 పోస్టులను కేటాయించారు.

– ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేస్తారు.

– రిజర్వేషన్ల వారీగా : ఓసీ-99 (జనరల్-63, మహిళ-36), బీసీ ఏ- 19 (జనరల్-3, మహిళ-16), బీసీ బీ-10 (జనరల్-1, మహిళ-9), బీసీ సీ-7, బీసీ డీ-4, బీసీ ఈ –    3 (మహిళ), ఎస్సీ-37 (జనరల్-17, మహిళ-20), ఎస్టీ- 11(మహిళ), పీహెచ్-3(మహిళ)

– విభాగాలు : ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ-41, పిడియాట్రిక్స్-27, అనస్థీషియా-39, ఆర్థోపెడిక్స్-5,

ఈఎన్‌టీ-20, డెర్మటాలజీ-1, పాథాలజీ-16, జనరల్ మెడిసిన్-34, సైకియాట్రిక్-3, రేడియాలజీ-3, జనరల్ సర్జరీ-16

– అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషాలిటీ సబ్జెక్ట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉండాలి.

ట్రల్/ రా్రష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఉండాలి.

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.

– పే స్కేల్- రూ. 40,270-93,270/-

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

– ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు.

– పేపర్-2 (సంబంధిత ఆప్షనల్ సబ్జెక్ట్)- 150 మార్కులకు ఉంటుంది. దీనిలో పార్ట్ ఏ (కామన్ సిలబస్)-45 ప్రశ్నలు, పార్ట్ బీ (సంబంధిత సబ్జెక్ట్ (పీజీ లెవల్)-75 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
– ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.

– అప్లికేషన్ ఫీజు : రూ. 200/-

– దరఖాస్తు : సెప్టెంబర్ 9

-ఆబ్జెక్టివ్ పరీక్ష : అక్టోబర్ 22

డెంటల్ అసిస్టెంట్ సర్జన్

– ఖాళీల సంఖ్య -10. వీటిలో జనరల్ అభ్యర్థులకు-4, మహిళా అభ్యర్థులకు-6

– రిజర్వేషన్లవారీగా : ఓసీ-4 (జనరల్-3, మహిళ-1), బీసీ ఏ-1 (మహిళ), బీసీ బీ-1 (మహిళ), ఎస్సీ-1 (మహిళ), ఎస్టీ- 1 (మహిళ), పీహెచ్-1 (మహిళ)

– అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీడీఎస్‌తోపాటు తెలంగాణ డెంటిస్ట్స్ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.

– పే స్కేల్ – రూ. 40,270-93270/-

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూద్వారా

– ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు.

– పేపర్-2 (డెంటల్ సర్జరీ)-150 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

– ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.

– అప్లికేషన్ ఫీజు : రూ. 200/-

– దరఖాస్తు : సెప్టెంబర్ 15

– ఆబ్జెక్టివ్ పరీక్ష : అక్టోబర్ 8

ట్యూటర్ పోస్టులు

– ఖాళీల సంఖ్య – 65

వీటిలో క్లినికల్-33, నాన్ క్లినికల్-32రిజర్వేషన్‌వారీగా క్లినికల్ పోస్టులు

– ఓసీ (జనరల్-11, మహిళ-6), బీసీ ఏ( జనరల్-2, మహిళ-1), బీసీ- బీ (జనరల్ -1, మహిళ-1), బీసీ సీ (జనరల్ -1), బీసీ డీ (మహిళ-1), బీసీ ఈ (మహిళ-1), ఎస్సీ-(జనరల్ – 3, మహిళ-2), ఎస్టీ- (జనరల్ -2, మహిళ -1)

రిజర్వేషన్‌ వారీగా నాన్ క్లినికల్ పోస్టులు

– ఓసీ (జనరల్-9, మహిళ-8), బీసీ ఏ(మహిళ -5), ఎస్సీ- (జనరల్ -3, మహిళ -5), ఎస్టీ (మహిళ -2 )

– అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. నాన్ క్లినికల్ పోస్టుకు ఎంబీబీఎస్/ ఎమ్మెస్సీ (సంబంధిత స్పెషాలిటీ)లో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ (బయోకెమిస్ట్రీ, అనాటమి, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ) ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.

– పే స్కేల్- రూ. 15,600-39,100/-

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

– ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు

– పేపర్ – 2 (మెడికల్ సైన్స్ అండ్ జనరల్ మెడిసిన్)-150 (డిగ్రీ స్థాయిలో) ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

– ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.

– అప్లికేషన్ ఫీజు : రూ. 200/-

– దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్ 15

– ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ : అక్టోబర్ 14

లెక్చరర్ పోస్టులు

– ఖాళీల సంఖ్య – 6

-రిజర్వేషన్‌వారీగా ఖాళీలు : ఓసీ (జనరల్-2, మహిళ -2), బీసీ ఏ (మహిళ-1), ఎస్సీ (మహిళ-1)

– అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. బార్క్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ కోర్సు (హాస్పిటల్ ఫిజిక్స్, రేడియోలాజికల్ ఫిజిక్స్) సర్టిఫికెట్ ఉండాలి.

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.

– పే స్కేల్- రూ. 37,100-91,450/-

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూద్వారా

– ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి- 150 నిమిషాలు కేటాయించారు.

– పేపర్ – 2 (రేడియోలాజికల్ ఫిజిక్స్, మెడికల్ ఫిజిక్స్)-150 (పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా స్థాయిలో) ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

– ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.

– అప్లికేషన్ ఫీజు : రూ. 200/-

– దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్ 15

– ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ : అక్టోబర్ 8

సివిల్ అసిస్టెంట్ సర్జన్

– ఖాళీల సంఖ్య – 43. (ఇన్సూరెన్స్ సెక్టార్). వీటిలో జనరల్ అభ్యర్థులకు-26, మహిళా అభ్యర్థులకు-17

– రిజర్వేషన్‌వారీగా : ఓసీ (జనరల్-15, మహిళ- 9), బీసీ ఏ(జనరల్-2, మహిళ-1), బీసీ బీ (జనరల్-2, మహిళ -1), బీసీ సీ (జనరల్-1), బీసీ డీ (జనరల్-1, మహిళ-1), బీసీ ఈ (మహిళ -1), ఎస్సీ (జనరల్ -3, మహిళ- 3), ఎస్టీ-(జనరల్ – 2, మహిళ -1)

– అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. మెడికల్ ప్రాక్టీషనర్‌లో పర్మినెంట్ సభ్యత్వం కలిగి ఉండాలి.

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.

-పే స్కేల్- 40,270-93,270/-

-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..

-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు

– పేపర్ – 2 (మెడికల్ సైన్స్ అండ్ జనరల్ మెడిసిన్)-150 ప్రశ్నలు (డిగ్రీ స్థాయిలో) ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

– ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.

– అప్లికేషన్ ఫీజు : రూ. 200/-

– దరఖాస్తుకు చివరితేదీ : సెప్టెంబర్ 15, పరీక్ష తేదీ : అక్టోబర్ 8

అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులు

– ఖాళీల సంఖ్య – 2 (ఇన్సూరెన్స్ సెక్టార్). వీటిలో జనరల్ అభ్యర్థులకు-1, బీసీ ఏ మహిళ-1

– అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఫిజియోథెరపిస్ట్‌లో డిప్లొమా ఉత్తీర్ణత

– వయస్సు : 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.

– పే స్కేల్- 17,890-53,950/-

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ద్వారా

– ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ( జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు 150 నిమిషాలు కేటాయించారు

– పేపర్ 2 ( ఫిజియోథెరపి)-150 ప్రశ్నలు (డిప్లొమా స్థాయిలో) ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

– అప్లికేషన్ ఫీజు : రూ. 200/-, చివరితేదీ : సెప్టెంబర్ 15

– పరీక్ష తేదీ : అక్టోబర్ 8, వెబ్‌సైట్: www.tspsc.gov.in

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వివరాలు

– పాత జిల్లాల వారీగా ఖాళీలు : 67. వీటిలో జనరల్ అభ్యర్థులకు-47, మహిళా అభ్యర్థులకు-20 పోస్టులను కేటాయించారు.

– రిజర్వేషన్‌వారీగా : ఓసీ-35 (జనరల్-25, మహిళ-10), బీసీ ఏ-4, బీసీ బీ-5 (జనరల్-3, మహిళ-2), బీసీ సీ-1, బీసీ డీ-4 (జనరల్-2, మహిళ-2), బీసీ ఈ-2 (జనరల్-1, మహిళ-1), ఎస్సీ-9 (జనరల్-5, మహిళ-4), ఎస్టీ-5 (జనరల్-4, మహిళ-1).

– జోన్ల వారీగా ఖాళీల వివరాలు : జోన్- Vలో -38. ఇందులో ఓసీ-20 (జనరల్-15, మహిళ-5), బీసీ ఏ-2, బీసీ బీ-4 (జనరల్-3, మహిళ-1), బీసీ డీ-3 (జనరల్-2, మహిళ-1), బీసీ ఈ-1, ఎస్సీ- 5 (జనరల్-3, మహిళ- 2), ఎస్టీ- 3 (జనరల్-2, మహిళ-1).

– జోన్- VIలో- 29. వీటిలో ఓసీ-15 (జనరల్-10, మహిళ-5), బీసీ ఏ-2, బీసీ బీ-3 (జనరల్-2, మహిళలు-1), బీసీ సీ-1, బీసీ డీ-1 (మహిళ), బీసీ ఈ-1 (మహిళ), ఎస్సీ-4 (జనరల్-2,
మహిళ -2), ఎస్టీ – 2.

– అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, జువాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్) లేదా బీఈ/బీటెక్ (అగ్రికల్చర్,
కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

-పే స్కేల్ : రూ. 31460-84970/-

శారీరక ప్రమాణాలు :

– పురుష అభ్యర్థులు ఎత్తు-163 సెం.మీ., ఛాతీ-79 సెం.మీ. నుంచి 84 సెం.మీ. వరకు వ్యాకోచించాలి.

– మహిళా అభ్యర్థులు ఎత్తు-150 సెం.మీ., ఛాతీ-74 సెం.మీ. ఉండాలి.

వాకింగ్ టెస్ట్ (నడక పరీక్ష)

– పురుషులు-25 కి.మీ. దూరాన్ని 4 గం., మహిళలు-16 కి.మీ. దూరాన్ని 4 గం. పూర్తిచేయాలి.

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, నడక, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా

– ఆబ్జెక్టివ్ రాతపరీక్ష మొత్తం నాలుగు పేపర్లుగా ఉంటుంది.

– క్వాలిఫయింగ్ పేపర్లు (జనరల్ ఇంగ్లిష్ -100, మ్యాథమెటిక్స్-100 మార్కులు)

– ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం- 100 నిమి. (పై రెండు)

– మెయిన్ పేపర్లు (జనరల్ స్టడీస్-150, ఆప్షనల్ పేపర్-300 మార్కులు)

– పదోతరగతి స్థాయిలో పరీక్ష ఉంటుంది.

– ప్రతి పేపర్‌కు సమయం- 150 ని.

– కేటాయించిన 21 ఆప్షనల్స్‌లో ఏదైనా ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి.

-ఆప్షనల్ సబ్జెక్ట్‌లో 150 ప్రశ్నలు-300 మార్కులు (ప్రతి ప్రశ్నకు 2 మార్కులు)

– ఇంటర్వ్యూకు 50 మార్కులు

– దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 12

– ఆబ్జెక్టివ్ పరీక్ష తేదీ : అక్టోబర్ 14, 15

– పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ), కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వివరాలు

– పాత జిల్లాల వారీగా ఖాళీలు : 90. వీటిలో జనరల్ అభ్యర్థులకు-61, మహిళా అభ్యర్థులకు-29 పోస్టులను కేటాయించారు.

– రిజర్వేషన్లవారీగా: ఓసీ-41 (జనరల్-26, మహిళ-15), బీసీ ఏ-6 (జనరల్-5, మహిళ-1), బీసీ బీ-7 (జనరల్-6, మహిళ-1), బీసీ సీ-1, బీసీ డీ-9 (జనరల్-6, మహిళ-3), బీసీ ఈ- 5 (జనరల్-3, మహిళ-2), ఎస్సీ-13 (జనరల్-9, మహిళ-4), ఎస్టీ-8 (జనరల్-5, మహిళ-3)

– జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: ఆదిలాబాద్-18 (జనరల్- 17, ఏజెన్సీ-1), వరంగల్- 7, కరీంనగర్- 9, హైదరాబాద్/రంగారెడ్డి- 17, మహబూబ్‌నగర్- 13 (జనరల్- 10, ఏజెన్సీ- 3),

నల్లగొండ- 6, నిజామాబాద్- 14, మెదక్- 6.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్) లేదా బీఈ/బీటెక్ (కెమికల్, మెకానికల్, సివిల్) తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

– వయస్సు: 2017 జూలై 1 నాటికి 18-31 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

– పే స్కేల్: రూ. 21,230-63,010/-

శారరీక ప్రమాణాలు:

– పురుష అభ్యర్థులు.. ఎత్తు- 163 సెం.మీ., ఛాతీ- 79 సెం.మీ. గాలిపీల్చినప్పుడు 84 సెం.మీ. వరకు వ్యాకోచించాలి.

– మహిళా అభ్యర్థులు.. ఎత్తు- 150 సెం.మీ., ఛాతీ- 79 సెం.మీ. ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
వాకింగ్ టెస్ట్ (నడక పరీక్ష)

– పురుషులు – 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో నడవాలి. మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో పూర్తిచేయాలి.

– ఎంపిక : ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, నడక పరీక్ష, మెడికల్ టెస్ట్.

– ఆబ్జెక్టివ్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1 (జనరల్ నాలెడ్జ్)-100 మార్కులు, పేపర్-2 (జనరల్ మ్యాథ్స్)-100 మార్కులు) ఉంటాయి. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం 90 నిమిషాలు.

– పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ), కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్

– దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 12, ఆబ్జెక్టివ్ పరీక్ష : అక్టోబర్ 22