పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాల హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. పంజాబ్‌లోని తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ చనిపోవడం కలకలం రేపుతోంది. మన్ దీప్ తుఫాన్, మన్మోహన్ సింగ్ హత్యకు గురయ్యారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కేశవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం సాయంత్రం జైల్లో మొత్తం ఐదుగురు ఖైదీల మధ్య గొడవ జరిగింది. గ్యాంగ్ స్టర్స్ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నట్లు సమాచారం.
సింగర్ సిద్ధూ మూసేవాలా గత ఏడాది మే 29న పంజాబ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్‌పూర్ గ్రామంలో ఆయనను దుండగులు కాల్చి చంపారు. సిద్ధూ జీపులో వెళ్తున్న సమయంలో ఏకంగా ఆరు షూటర్లు 25-30 రౌండ్ల కాల్పులు జరిపారు. హత్యకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ సిద్ధూ హత్యకు తానే కారణమని అంగీకరించాడు. అనంతరం పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.