2 Fighter Planes Collide During US Air show, 6 Feared Dead
mictv telugu

ఎయిర్ షోలో విమానాలు ఢీకొని.. ఆరుగురు మృతి!

November 13, 2022

అమెరికా డల్లాస్లో నిర్వహించిన ఓ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు విమానాలు.. గాలిలో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన అనంతరం ఈ విమానాలు బూడిదగా మారిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదానికి గురైన విమానాల పేర్లు.. బోయింగ్ బీ-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ పీ-63 కింగ్కోబ్రా. కాగా.. విమానాలు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రెండు విమానాలు అత్యంత సమీపంలోకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదంపై ‘ది ఫెడరల్‌ ఎవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ఓ ప్రకటనలో పేర్కొంది. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి.

ఈ ఘటనతో కలిగిన ప్రాణ నష్టం గురించి అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ స్థానిక మీడియా ప్రకారం.. ప్రమాదం సమయంలో రెండు విమానాల్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఎయిర్ షో ను తిలకించేందుకు 4వేల నుంచి 6వేల మంది సందర్శకులు ప్రమాద సమయంలో అక్కడే ఉన్నారు. రెండు విమానాలు ఢీకొన్న ఘటనకు సంబంధిం చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటన సమయంలో నేలపై పడిపోయిన శిథిలాలు విమానాశ్రయం దక్షిణంవైపు నుండి హైవే-67 మీదుగా ఎదురుగా ఉన్న స్ట్రిప్ మాల్ వరకు పడినట్లు అధికారులు తెలిపారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకముందే రెండు విమానాలు ఢీ కొన్నాయి. రెండు విమానాలు ముక్కలుగా విడిపోయి భూమిపై పడుతుండటంతో వీడియోలో చూడొచ్చు.