పండగపూట ‘నాగదేవతల’ అతి.. కేసు నమోదు..  - MicTv.in - Telugu News
mictv telugu

పండగపూట ‘నాగదేవతల’ అతి.. కేసు నమోదు.. 

October 12, 2019

2 Gujarat women, girl held for performing garba holding snakes

దసరా నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దసరా సందర్భంగా గార్బా డాన్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అందరూ కూడా గార్బా డాన్స్ చేస్తుంటారు. అయితే వన్యప్రాణులతో గార్బా డాన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

గుజరాత్‌ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలోని షీల్ గ్రామంలో ఈ నెల 6న నిర్వహించిన గార్బా డాన్స్‌లో ఇద్దరు మహిళలు, ఓ బాలిక నాగదేవతల్లా పోజుల కొడుతూ చేతిలో పాములను పట్టుకుని డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్త అటవీ శాఖ అధికారులకు చేరడంతో వారు సదరు మహిళలను గురువారం అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ముగ్గురు మహిళలు ఒక నాగుపాము, రెండు విషపూరితం కాని పాములను పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేశాం. ఆ  ఉత్సవాలను ఏర్పాటుచేసిన వ్యక్తులను, మహిళలదేకు పాములు సరఫరా చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని అటవీ శాఖ అధికారి సునీల్ బెర్వాల్ తెలిపారు.