కరోనా పరీక్ష చేయించుకో అని లొల్లి.. ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పరీక్ష చేయించుకో అని లొల్లి.. ఇద్దరు మృతి

May 16, 2020

Madhya pradesh.

కరోనా చేయని నయవంచన లేదు. ఎన్నో దారుణాలకు కరోనా కారణం అవుతోంది. కంటికి కనిపించకుండానే మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. మరోవైపు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. తాజాగా ఈ కరోనా మహమ్మారి ఇద్దరి మధ్య లొల్లి పెట్టింది. వారి మృతికి కారణం అయింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా పరీక్షల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారిని స్థానికులు అనుమానంగా చూస్తున్నారు. కరోనాను వెంట బెట్టుకువచ్చాడేమోనని శతృవులా చూస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లా ప్రేంనగర్ ప్రాంతానికి  ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాడు. అప్పటినుంచి స్థానికులు అతన్ని అనుమానంగా చూడసాగారు. కరోనా ఉందేమోనని సందేహించారు.  దీంతో ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు జరపాలని ఓ వర్గం వారు పట్టుబట్టారు. అందుకు అతడు పరీక్షలు చేసుకోనని.. తనకు ఇదివరకే నెగెటివ్ వచ్చిందని చెప్పాడు. కానీ ఇవతలి వర్గం వారు పరీక్ష జరపాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. అంతటితో ఆగకుండా పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో ఓ వృద్ధురాలు ఉంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం వారంలో రెండోసారి.