2 lakh rupees compensation to dog-bite victim, foreign breeds banned
mictv telugu

కుక్క కాటుకు 2 లక్షల పరిహారం..

November 17, 2022

కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి తీర్పు వెలువరించింది హరియాణాలోని వినియోగదారులు ఫోరమ్. భయంకర జాతికుక్క దారినపోయే అమాయకురాలిని కరిచిన కేసులో గురగ్రామ్ జిల్లా వినియోగదారుల కోర్టు తీర్పు ఇస్తూ బాధితురాలికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాని కుక్క యజమానిని ఆదేశించింది. ఈ ఏడాది ఆస్టులో సివిల్ లైన్ ప్రాంతంలో డాగో అర్జెనిటో అనే జాతి కుక్క హల్ చల్ చేసింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మున్నీ అనే మహిళ తలను తీవ్రంగా కరిచింది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కింది. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు కుక్క యజమానికి చీవాట్లు పెట్టింది. భారత ప్రభుత్వం నిషేధించిన డాగో అర్జెనిటో జాతి కుక్కను ఎందుకు పెంచుకుంటున్నారని తిట్టి, మున్నీ కోలుకోవడానికి 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా కుక్కను స్వాధీనం చేసుకోవాలని మునిసిపల్ అధాకారులను ఆదేశించింది. 11 విదేశీ జాతి కుక్కలను పెంచుకోకుండా నిషేధం కూడా విధించింది. ఆకలితో, ఇతర సమస్యలతో పిచ్చెత్తి జనాన్ని కరిచే వీధికుక్కలకు ఆహారం పెట్టాలని మునిసిపల్ సిబ్బందిని ఆదేశించింది.