ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఖతం - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఖతం

September 25, 2020

gngj

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ముష్కరులను మట్టు పెడుతున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో వీరికి మద్దతుగా నిలుస్తోంది. కశ్మీర్ లో దాగి ఉన్న ముష్కరుల వివరాలను ఇంటలిజెన్స్ బ్యూరో పోలీసులకు, భద్రతా దళాలకు ఇస్తున్నది. వారు కూంబింగ్ నిర్వహించి ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 

అనంత్‌నాగ్ జిల్లాలోని సిర్హమా ప్రాంతంలో ఈరోజు ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. పోలీసులను, భద్రతా దళాలను చూసిన ముష్కరులు కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. ఇంకా ఇరు పక్షాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.