టీచరమ్మను కట్టేసి ఈడ్చుకెళ్లిన పంచాయతీ పెద్దలు - MicTv.in - Telugu News
mictv telugu

టీచరమ్మను కట్టేసి ఈడ్చుకెళ్లిన పంచాయతీ పెద్దలు

February 3, 2020

2 sisters.

పశ్చిమబెంగాల్‌లోని సౌత్ దినాజ్‌పూర్‌లో దారుణం జరిగింది. తమ భూమిలో చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అక్కా చెల్లెళ్లను తీవ్రంగా కొట్టి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు అధికార టీఎంసీ పార్టీ సభ్యులు. గత శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్మృతి కాన దాస్‌(29) స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ తల్లి, సోదరితో కలిసి ఫటానగర్‌లో నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరు కొంత భూమిని కోల్పోయారు.

दिनांक 2 फरवरी 2020 बंगाल में सड़क निर्माण के लिए ज़मीन के जबरदस्त अधिग्रहण के विरोध में पार्टी नेता महिला सहित टीएमसी के गुंडों ने उनका विरोध किया और उनकी पिटाई की टीएमसी ने अमल सरकार को आरोपों की जांच के लिए निलंबित कर दिया है कि वह प्राथमिक विद्यालय के शिक्षक की पिटाई करने वाली भीड़ का एक हिस्सा था। ममता बनर्जी के नेतृत्व वाले पश्चिम बंगाल में एक और क्रूर हमला कथित तौर पर टीएमसी के गुंडों द्वारा किया गया है। 2 फरवरी 2019 को, दक्षिण दिनाजपुर जिले के गंगरामपुर में एक प्राथमिक विद्यालय के शिक्षक को लोगों के एक समूह द्वारा रस्सी से बांधकर घसीटा गया और घसीटा गया। लोगों के समूह में एक स्थानीय टीएमसी नेता अमल सरकार भी शामिल थे। पिटाई करने वाले शिक्षक की पहचान स्मृति काना दास के रूप में हुई है।On 2 February 2020, TMC goons, including party leader Mahila, protested against the tremendous acquisition of land for road construction in Bengal and her beating TMC suspended the Amal Sarkar for investigating the allegations that she was an elementary school K was a part of the mob beating the teacher. Another brutal attack in Mamta Banerjee-led West Bengal is allegedly carried out by TMC goons. On 2 February 2019, a primary school teacher in Gangarampur in South Dinajpur district was tied and dragged by a group of people with a rope. The group of people also included Amal Sarkar, a local TMC leader. The beating teacher has been identified as Smriti Kana Das.

Publiée par Kalu Singh Chouhan sur Dimanche 2 février 2020

తాజాగా ఆ రోడ్డును మరింత విస్తరించే పనులు ప్రారంభమయ్యాయి. దీంతో వీరు మళ్లీ కొంత భూమిని కోల్పోవాల్సి వచ్చింది. దీనికి వారు ఒప్పుకోలేదు. దీంతో రెచ్చిపోయిన పంచాయతీ పెద్దలు శుక్రవారం జేసీబీని తీసుకొచ్చి వారి భూమిలో రోడ్డు పనులు చేపట్టారు. దీన్ని అడ్డుకోవానికి వచ్చిన ఇరానీతో పాటు ఆమె సోదరిని అధికార పార్టీ టీఎంసీకి చెందిన పంచాయతీ నాయకుడు అమల్‌ సర్కార్‌, తన అనుచరులతో కలిసి తీవ్రంగా కొట్టాడు.  కాళ్లను అక్కాచెల్లెళ్ల కాళ్ళను కట్టేసి రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు స్మృతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై పోలీసులు కేసు నమోదుచేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో అమల్ సర్కార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది.