అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బే ప్రాంతంలో రెండు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యయి. తెలుగు విద్యార్థులపై కాల్పులు జరపడంతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన షికాగోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవాన్ష్, సాయి చరణ్, లక్ష్మణ్‌లు ఉన్నత విద్య కోసం పది రోజుల క్రితం అమెరికాలోని షికాగోకు వచ్చారు. ముగ్గురు అద్దె తీసుకొని నివాసం ఉంటున్నారు.
ఇంటర్నెట్ కనెక్షన్ కోసం రూటర్ కావాల్సి వచ్చింది. రూటర్ తీసుకునేందుకు ముగ్గురు కలిసి వాల్‌మార్ట్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. వారిని నల్లజాతీయులు వెంబడించారు. వాళ్లను తుపాకులతో బెదిరించి డబ్బులు, పోన్లు లాక్కున్నారు. దుండగులు వెళ్తూ వెళ్తూ వారిపై కాల్పులు జరపడంతో దేవ్‌శిష్ చాతీలో బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడ్డారు. సాయిచరణ్‌కు ఊపిరితిత్తులోకి బుల్లెట్లు వెళ్లడంతో గాయపడ్డారు. తుపాకీ కాల్పుల నుంచి మాత్రం లక్ష్మణ్ తప్పించుకున్నాడు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవాన్ష్ దుర్మరణం చెందాడు.
ఇక సాయిచరణ్‌కు శస్త్రచికిత్స నిర్వహించగా.. ఆయన ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు . కాల్పుల విషయం తెలియగానే అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ మాత్రం కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు తెలిసింది.