పిజ్జా బాయ్‌కి బుడ్డోడి హగ్.. కారణం తెలిసి కన్నీళ్లు! - MicTv.in - Telugu News
mictv telugu

పిజ్జా బాయ్‌కి బుడ్డోడి హగ్.. కారణం తెలిసి కన్నీళ్లు!

February 24, 2020

2-year-old hugs pizza delivery man whose daughter recently died.

పిజ్జా బాయ్‌ని ఓ రెండేళ్ల బాలుడు పట్టుకుని ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డ ఎందుకలా చేశాడో తెలుసుకుని తల్లి షాక్ అయింది. ఈ వీడియోను ఆమె తన ఎఫ్బీ ఖాతాలో పంచుకుంది. రాయన్ క్యాటర్సన్ అనే పిజ్జా డెలవరీ బాయ్‌ ఇటీవల లిండసే షిల్లే అనే మహిళ ఇంటికి ఆర్డర్‌ను ఇచ్చేందుకు వెళ్లాడు. డోర్ బెల్ కొట్టాడు.. ఇంతలో తలుపు తీసుకుని ఆమె రెండేళ్ల కొడుకు కొహెన్.. పరుగు పరుగున వెళ్లి రాయన్‌ని కౌగిలించుకున్నాడు. అతని వెంట తల్లి కూడా బయటకు వచ్చి తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలియక తికమక పడుతూనే అతన్ని లోపలికి తీసుకువెళ్లింది. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియోను షిల్లే ఫేస్‌బుక్‌లో సరదాగా పోస్టు చేసింది. 

ఆ వీడియోను పిజ్జా బాయ్ రాయన్‌ను ట్యాగ్ చేసేందుకు అతడి ఫేస్‌బుక్ పేజీలోకి వెళ్లింది. దీంతో ఆమెకు గుండె బరువెక్కించే విషయం తెలిసింది. కొద్ది రోజుల కిందట రాయన్ తన కుమార్తెను కోల్పోయాడని తెలుసుకుంది. తన కొడుకు ఈ విషయాన్ని ముందే గ్రహించి అతన్ని కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.