20 కోట్ల మంది భారతీయులకు కరోనా.. ఐసీఎంఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

20 కోట్ల మంది భారతీయులకు కరోనా.. ఐసీఎంఆర్

September 29, 2020

20 crore Indians affected Covid icmr survey

దేశ ప్రజలకు కరోనా ముప్పు ఇంకా పొంచే ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ స్థితిగతులపై విడుదల చేసిన తాజా సర్వే నివేదికలో పలు దిగ్భ్రాంతికర అంశాలను కూడా వెల్లడించింది. దేశంలో ఏకంగా 20 కోట్లమందికి కరోనా సోకి వెళ్లిపోయిందని, రానున్న రోజుల్లో మరింత పెచ్చరిల్లుతుందని ప్రకటించింది. 

‘ఆగస్ట్ నెలాఖరికల్లా 20 కోట్ల మందికి వైరస్ వచ్చిపోయింది. 10 ఏళ్లకు పైబడిన వారిలో ప్రతి 15 మందిలో వ్యాధి సోకింది. పట్టణ మురికివాడల్లో 15.6శాతం మందికి సోకి నయమైంది. సిటీల్లో 8.2 శాతం మందికి, పల్లెల్లో 4.4శాతం మంది వ్యాధి సోకింది. లింగ, వయోభేదం లేకుండా వ్యాపించింది. రానున్న శీతాకాలంలో వ్యాధి మరింత పెచ్చరిల్లే అవకాశముంది..’ అని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఈ సర్వే కింద 29 వేలమంది రక్తనమూనాలు సేకరించారు. ముంబైలో అత్యధిక కేసులు నమోదైనట్లు గుర్తించారు. పాత సర్వేల్లో గ్రామాలో ఎక్కువ కరోనా కేసులు నమోదు కాగా, తాజా సర్వేల్లో పట్టణ, నగర ప్రాంతాల్లో కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.