20 feet clay Ganesh idol fell while being moved for immersion
mictv telugu

నిమజ్జనానికి తరలిస్తుండగా.. కూలిన 20 అడుగుల గణేశ్‌ విగ్రహం

September 9, 2022

హైదరాబాద్ నగరంలో గణనాథుల శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. నగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే నెలకొంది. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా అంటూ ప్రధాన వీథులన్నీ మార్మోగుతున్నాయి. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్, పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నిమజ్జనానికి తరలిస్తుండగా.. ఓ గణేషుడి విగ్రహం కూలిపోయింది.

వర్షానికి తడిచి.. నిమజ్జనానికి వెళ్తున్న గణేష్ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటన హిమాయత్ నగర్ లో జరిగింది. కర్మన్ ఘాట్ లోని టీకేఆర్ కాలేజీ వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు నిమజ్జనానికి వెళుతుండగా హిమాయత్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద విగ్రహం కూలిపోయింది.

కాగా, ఈసారి వినాయక విగ్రహాలకి వర్షం పెద్ద ఆటంకంగా మారింది. జనాల్లో పర్యావరణ స్పృహ పెరిగి.. మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని.. ఎక్కువ నాణ్యత లేకుండా మట్టి విగ్రహాలు తయారు చేస్తుండడం.. దీనికి తోడు వర్షాల వల్ల విగ్రహాలు.. చాలావరకూ వాననీటికి విచ్చుకుపోతున్న ఘటనలు అనేక మండలాల్లో కనిపించింది. దీనివల్ల 2,3 రోజుకే విగ్రహాలు నిమజ్జనానికి తరలించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి గణేష్ నిమజ్జనోత్సవం కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటలలోపే అనేక విగ్రహాలు నిమజ్జనం జరిగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కూడా 11గం.లవరకే పూర్తవ్వడం విశేషం.