20 people died while going to Rakshabandhan
mictv telugu

ఘోరం: రక్షాబంధన్‌కు వెళ్తుండగా..20 మంది మృతి

August 11, 2022

20 people died while going to Rakshabandhan

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం బందా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. రక్షాబంధన్‌కు వెళ్తుండగా యమునా నదిలో ఓ పడవ మునిగి, ఏకంగా 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నారని, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

”మార్కా గ్రామంలోని మార్కా ఘాట్‌ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు ప్రధాన కారణం.. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదం జరిగింది. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్‌ కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది. పలువురి ఆచూకీ గల్లంతైంది. వారికోసం గాలిస్తున్నాం. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర‍్యలు కొనసాగుతున్నాయి.” అని బాందా పోలీసులు తెలిపారు.

తమ కుటుంబ సభ్యులు యమునా నదిలో మునిగి మృతి చెందారన్న వార్త తెలియడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పండగపూట ఈ ఘోరం జరగడంతో చుట్టుపక్కల ఉన్న వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు.