కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్ కచ్చితంగా ఈ సంవత్సరం ఒక పెద్ద ఈవెంట్ కాబోతున్నది. ఈ మారథాన్ లో 20 మంది మహిళా సర్పంచ్ లు పాల్గొనున్నారు. అంతర్జాతీయ రన్నర్లు, అథ్లెట్లు కాకుండా ఈ సంవత్సరం టాటా ముంబై మారథాన్ లో.. గ్రామీణ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది మహిళా సర్పంచ్ లు జనవరి 15న ముంబైలో డ్రీమ్ రన్ లో పాల్గొనబోతున్నారు.
RSCD , ISHAD అనే రెండు లాభాపేక్ష రహిత సంస్థలచే ఒక వినూత్న చొరవతో ఈ రన్ నిర్వహించబడుతున్నది. ప్రభుత్వాలలో ఎన్నికైన ప్రతినిధుల ద్వారా విద్య, శిక్షణ, సాధికారత గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 20వేల మంది ప్రతినిధులను పాల్గొనేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ మొదలైన అవసరమైన సేవలను పంచాయితీ రాజ్ సంస్థలు, సంబంధిత స్థానిక స్వయం ప్రభుత్వాల నుంచి ఎన్నికైన ప్రతినిధుల ద్వారా మాత్రమే పౌరులందరికీ ఉత్తమంగా అందించగలం. మునిసిపల్ కార్పొరేషన్లు, కౌన్సిల్స్, భారతదేశం ప్రజాస్వామ్య నిర్మాణంలో మూడవ శ్రేణిలో ఉంది. ఇది 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సూచించిన వ్యూహాలకు అనుగుణంగా ఉంది.
ఆ లిస్ట్ ఇదే..
మహిళా సాధికారతలో ఆదర్శంగా నిలుస్తున్న 20 మంది మహిళా సర్పంచ్ ల వివరాలు ఈ సంస్థ వెల్లడించింది. మహారాష్ట్రకు చెందిన వారి పేర్లు.. సెమీనా పంచాంగే, వర్షా పింగిల్, ప్రణయ టెమ్ కార్, అర్జన పవార్, నీతా పోత్ ఫోడ్, శ్రద్ధా గైధానే, ఉమా మాలి, అర్చన కాంబ్లే, వర్షా జంబుల్కర్, షర్మిలా రామ్ టేకే, సంగీత జాత్కర్ రత్నమాల వైద్య, హర్షదా వాల్కే, మాల్తీ సగ్నే, సునంద మాండ్లే, సురయ్య పఠాన్, నందా గైక్వాడ్, సమీనా షేక్, ప్రద్న్య అవడే. ఈ 20 మంది కూడా ఈ మారథాన్ లో పరుగు పెట్టనున్నారు.