ఆమెకు 20, అతనికి 70.. వారెవ్వా! - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెకు 20, అతనికి 70.. వారెవ్వా!

October 20, 2022

ప్రేమకే కాదు, పెళ్లికి కూడా ఎలాంటి తేడాలూ ఉండవు ఈ పాడు లోకంలో. మనవరాళ్ల వయసున్న వాళ్లను పెళ్లిచేసుకునే తాతలు కొందరైతే, మనవడి వయసున్న యువకులను పెళ్లాడే బామ్మలు మరికొందరు. గుడ్డిప్రేమ, ఆకర్షణ, డబ్బు, పెద్దల బలవంతం, మూఢనమ్మకాలు.. కారణం ఏదైనా ఇలాంటి వింత పెళ్లిళ్లు ప్రపంచమంతా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి పెళ్లి వీడియో ఒకటి బయటికి పొక్కింది. బెంగాల్, లేదా అస్సాంలో ఈ జరిగి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

20 ఏళ్ల యువతి తన తాత వయసున్న 70 ఏళ్ల ముసలాడిని ఎంచక్కా పెళ్లాడేసింది. పెళ్లిపీటలపై వీరిద్దరూ ఈడూ జోడూలా కూర్చుని ఏమాత్రం ఇబ్బంది పడకుండా తంతులో పాల్గొన్నారు. వధువు కొన్నిసార్లు వరుడివైపు చూస్తూ బాగానే ఉన్నాడు కదా అన్నట్లు ముఖం పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు నానా రకాలుగా స్పందించారు. ముసలాడికి దసరా పండగ అని కొందరు, పాపం అతడు పుటుక్కుమంటే ఆమె బతుకేంగాను అని మరికొందరు వాపోతున్నారు. పెళ్లి అనేది వ్యక్తిగత విషయమని, అలా మాట్లాడడం తప్పు అని మరికొంత మంది పెద్దమనుషులు సూచిస్తున్నారు.