200 Andhra lorries with eggs stopped at the border
mictv telugu

సరిహద్దు వద్ద ఆగిన 200 కోడిగుడ్ల ఆంధ్రా లారీలు

April 27, 2022

200 Andhra lorries with eggs stopped at the border

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 200 కోడిగుడ్ల లారీలు మంగళవారం సాయంత్రం నుంచి ఒడిషా బోర్డర్ వద్ద నిలిచిపోయాయి. ఏపీ నుంచి వచ్చే గుడ్ల వల్ల తమ రాష్ట్రంలో తమ రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన గుడ్లకు గిరాకీ లేకుండా పోతుందనే కారణంతో ఈ పని చేశారు. ఇటీవల కాలంలో దాణాతో పాటు ఇతరత్రా ధరలు పెరిగిపోగా, గుడ్డు ధర మాత్రం తగ్గిపోయింది. దీంతో ఏపీ నుంచి అసోం, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే లారీలను సైతం ఒడిషా అధికారులు ఆపేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర పౌల్ట్రీ దారుల సమాఖ్య ఒడిషా అధికారులతో సంప్రదింపులకు దిగింది. అంతేకాక, అక్కడి సమాఖ్యను సమస్యలపై చర్చించడం కోసం రాజమహేంద్రవరానికి రావాల్సిందిగా కోరింది.