మన దేశంలలో అవుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపొతోంది. అస్సలు గోవుల గురించి సరిగ్గా పట్టించుకునే ప్రభుత్వాలే కనిపించడం లేదు. బీజేపీ ప్రభుత్వం గోసంరక్షణ చేపట్టిన అది నామమాత్రంగానే ఉంది. గోవుల సంఖ్య నానాటికి తగ్గుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లో ఆవులు మేత లేక ప్రాణాలను కోల్పొతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే దాదాపుగా 200 ఆవులు చనిపొయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన దుర్గ్ సమీపంలో ఉన్న రాయపూర్ గోశాలలో జరిగింది. ఆవులకు మేత లేకనే చనిపోయినట్లు గ్రామ సర్పంచ్ సేవారామ్ సాహూ తెలిపారు. కొందరు మత ఛాందసా వాదులు గోసంరక్షణ పేరుతో, ఆవులను చంపి తింటున్నారని ఆమాయాక జనాలను కొట్టి చంపుతున్నారు. ఇప్పటికైనా అమాయాక జనాలను చంపడం వదలి ఆవుల ప్రాణాలను కాపాడి వారి బాధ్యతను నిర్వర్తించుకోవాలి.