కలియుగ కుంభకర్ణుడు.. 200 కేజీలు, ఇద్దరు భార్యలు... - MicTv.in - Telugu News
mictv telugu

కలియుగ కుంభకర్ణుడు.. 200 కేజీలు, ఇద్దరు భార్యలు…

June 11, 2022

300 కేజీలు, 400 కేజీలు బరువు ఉన్న మనుషులు చాలామందే ఉన్నారు ఈ భూమిపైన. తిండి యావతో కొందరు, జబ్బుల వల్ల కొందరు బరువు పెరుగుతుంటారు. మన దేశంలోనూ ఓ భారీకాయుడు ఉన్నాడు. రోజుకు లెక్కవేసినట్టు 15 కేజీల తిండి తింటున్నాడు. అంటే పదిమంది తినే తిండి ఒక్కడే బుక్కేస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు కూడా. ఊబకాయం వల్ల పిల్లలు పుట్టలేదు. అధిక బరువు వల్ల నడడం కూడా సాధ్యం కావడం లేదు. అయినా డోన్ట్ కేర్ అంటున్నాడు. తనకు ఎంత తిన్నా తరగని ఆస్తి ఉందని డైటింగ్ జోలికి వెళ్లడం లేదు.

 

అతని పేరు మహ్మద్ రఫీక్. బిహార్‌లోని కతియర్ జిల్లా వాసి. 30 ఏళ్ల రఫీక్ కు చిన్నప్పటి నుంచి యమ ఆకలి. బలిమియా నెర్వోసా అనే జబ్బు ఉందీయనకు. ఎంత తిన్నా కడుపు నిండినట్టే ఉండదట. 3 కిలోల అన్నం, 4 కిలోల గోధుమ రొట్టెలు, 2 కేజీల మాంసం, కేజీన్నర చేపలు కుమ్ముతాడు. రోజుకు మూడు లీటర్ల పాలు తాగుతాడు. ఒక్క భార్య ఇంతేసి వంటావార్పూ చేయడం కష్టం కావడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. అతని బరువును తట్టుకోవడం మామూలు బైక్ వల్ల సాధ్యం కాకపోవడంతో బుల్లెట్ బండి కొనుక్కున్నాడు. అది కూడా మొరాయిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, రఫీక్‌ను బంధువులు పెళ్లిళ్లకు, ఇతర కార్యాలకు పిలవడం లేదు. కారణం మీరు ఊహించిందే.