3 నెలల తర్వాతే 200  - MicTv.in - Telugu News
mictv telugu

3 నెలల తర్వాతే 200 

September 4, 2017

ఆర్బీఐ కొత్త రూ. 50, రూ.  200 నోట్ల ను విడుదల చేసినప్పటికీ చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.  200 నోట్లు ఇంకా ప్రజలకు విరివిగా అందుబాటులోకి రావడం లేదు. వీటిని కేవలం  బ్యాంక్ లు మాత్రమే పంపిణి చేస్తున్నాయి. ఏటీఎంలకు  రావాలంటే ఇంకా మూడు నెలల సమయం పడుతుందని బ్యాంకింగ్  వర్గాలు చెబుతున్నాయి. ఏటీఎంలోకి కొత్త 200 నోట్లు రావాలంటే, ఏటీఎంలను అందుకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. రూ. 200 నోటుకు సరిపడే అరలను అమర్చాల్సి ఉంటుంది. తర్వాత అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిక్షించాలి. ఈ తతంగం పూర్తవడానికి మూడు నెలలు పడుతుంది.  గతేడాది పెద్దనోట్ల రద్దు చేశాక తర్వాత తొలిసారి ఏటీఎం యంత్రాల్లో కొత్త నోట్ల పంపిణీకి అనుగుణంగా మార్పులు చేశారు. ఇప్పుడు రూ. 200 నోట్ల కోసం కూడా మొత్తం 2. 25 లక్షల ఏటీఎంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.