2 వేల రూపాయలూ.. నీ జాడ ఎక్కడ తల్లీ! - MicTv.in - Telugu News
mictv telugu

2 వేల రూపాయలూ.. నీ జాడ ఎక్కడ తల్లీ!

August 30, 2019

2000 Note.

కేంద్ర ప్రభుత్వం 2016లో నోట్ల రద్దు చేసిన తర్వాత చలామణిలోకి సరికొత్తగా రూ. 2000 నోటును తీసుకువచ్చింది. అంతకు ముందు అతిపెద్ద నోటుగా రూ. 1000 నోటు మాత్రమే ఉండగా వాటి స్థానంలో 2వేల నోటును పరిచయం చేశారు. నల్లధనాన్ని అరికట్టొచ్చని, కరెన్సీ ముద్రణ ఖర్చులు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. ప్రారంభ సమయంలో వీటి చలామణి ఎక్కువగానే ఉండేది. కానీ క్రమేణ అది కనుమరుగు అవుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలో వీటి చలామణి 31.2 శాతానికి పడిపోయినట్టుగా తాజా గణాంకాలు చెబుతున్నాయి. 

నోట్ల రద్దు తర్వాత రూ. 500 నోట్లు తక్కువగా అందుబాటులో ఉండేవి. కానీ తర్వాత వీటి వాడకం చాలా వరకు పెరిగింది. ఆర్బీఐ కూడా ఎక్కువగా నోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండేళ్ల క్రితం రూ.500 నోట్ల చలామణి 22.5 శాతంగా ఇప్పుడు 51 శాతానికి పెరిగింది. 2016-17 రూ. 2 వేల నోట్ల చలామణి 50.2 శాతంగా ఉండగా తాజాగా 31.2 శాతానికి పడిపోయింది. ఒక్క 2వేల నోటు మినహా మిగతా అన్ని నోట్ల చలామణి బాగానే ఉన్నట్టు ఆర్భీఐ చెబుతోంది. అయితే 2వేల నోటు వల్ల చిల్లర కొరత ఏర్పడటం ఓ కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి దీనికి విరుగుడుగా ఆర్భీఐ ఏమైనా చర్యలు చేపడుతుందో లేదో చూడాలి. ఎన్నికల సమయంలోనే కాకుండా పలు సందర్భాల్లో తనిఖీల్లో పట్టుబడుతున్న లెక్కల్లేని డబ్బులో అత్యధికంగా 2 వేల నోట్లే ఉంటున్నాయి. ఈ నోట్లను అక్రమార్కులు పదిలం చేసుకుంటున్నారు.