నోట్ దిస్ పాయింట్... ఇక చిల్లర చింత తీరినట్లే..! - MicTv.in - Telugu News
mictv telugu

నోట్ దిస్ పాయింట్… ఇక చిల్లర చింత తీరినట్లే..!

July 20, 2017

ఏటీఎంల్లో డబ్బులు రావడం లేదు.. వచ్చినా అన్ని రెండువేల నోట్లే. అప్పడప్పుడు ఐదు వందల నోట్లు వస్తున్నాయి. రెండు వేల నోట్ ను మార్పించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎవరూ చిల్లర ఇవ్వడం లేదు. అందుకే ఈ నోట్లు జేబులో ఉన్నాయంటే లేనిపోని టెన్షన్. డోంట్ వర్రీ ఇక ముందు ఆ టెన్షన్ ఉండదు. ఇబ్బడి ముబ్బడిగా రెండువేల నోట్లు ఇక ముందు కనిపించవు..అన్ని ఐదు వందల నోట్లే కనిపించనున్నాయి.

హమ్మయ్య…రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు జనం కష్టాలు గుర్తొస్తున్నాయి. చిల్లర లొల్లి చెవిన పడ్డట్టుంది. ఇక ముందు రెండువేల నోట్లు సరాఫరా తగ్గించాలని నిర్ణయించింది. కొన్ని వారాల నుంచి ఈ నోట్ల సప్లయ్ పడిపోయింది. అందుకే అన్ని ఐదు వందల నోట్లనే అచ్చేస్తోంది.ఈవే ఎక్కువగా చలామణీ అయ్యేటట్లు చూస్తోంది. కేవలం 2000 రూపాయి నోట్లను రీసర్క్యూలేషన్‌ కిందనే తిరిగి మళ్లీ బ్యాంకులకే వెళ్తున్నాయి. కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదు.

ఏటీఎంలలో నగదును స్టోర్‌ చేయడానికి నాలుగు క్యాసెట్లు ఉంటాయి. ఒక క్యాసెట్‌ 2000 రూపాయి నోట్లతో నింపితే మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుంది. అదే ఆ క్యాసెట్‌ను రూ.500 నోట్లతో నింపితే, మెషిన్‌ సామర్థ్యం రూ.25 లక్షలకు పడిపోతుంది.అయినా కస్టమర్లకు తేలికగా చిల్లర దొరకడానికి, ఏటీఎంల దగ్గర సామర్థ్యం తగ్గినప్పటికీ, చిన్న కరెన్సీ నోట్లు రూ.500 నోట్లనే ఎక్కువగా సరఫరా చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. త్వరలోనే చిల్లర సమస్యను పూర్తిగా తగ్గించడానికి కొత్త రూ.200 నోట్లను మార్కెట్‌లోకి తెబోతుంది.