2000 కి.మీ నడిచి.. ఇంటికెళ్లిన గంటకే పాము కాటుకు బలి
లాక్‌డౌన్‌ను జయించినా మృత్యువును జయించలేకపోయాడు. బెంగళూరు నుంచి 2000 కిలోమీటర్లు ప్రాణాలు ఉగ్గబట్టుకుని నడచి ఇంటికెళ్లి పాముకాటుకు బలయ్యాడు. తల్లి ఒడిలో వాలి గంటసేపు కూడా కాకముందే కాలసర్పం బలితీసుకుంది. విధిరాతను నమ్మను వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసే ఉతంతమింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా ధానేపూర్ గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఉపాధి దొరక్క స్వస్థలానికి బయల్దేరాడు. 12 రోజుల పాటు 2 వేల కి.మీ నడిచి గత నెల 26 ఇంటికి చేరుకున్నాడు. తల్లి కొడుకును అక్కున చేర్చుకుంది. తర్వాత కాళ్లు కడుక్కోడానికి పొలంలోకి వెళ్లాడు. అక్కడే తిరుగుతున్న పాము సల్మాన్‌ను కాటేసింది. తల్లి విషయం తెలుసుకుని కుప్పకూలింది. ఆమెకు ఐదుగురు పిల్లలు కూడా సల్మాన్ ఆఖరి వాడు. సల్మాన్ రోడ్డుపై నడుస్తున్నప్పుడు పత్రికల్లో అని ఫొటోలు కూడా విరివిగా వచ్చాయి. నడిచి నడిచి అలసిపోవడం, పాముకాటును తట్టుకునే శక్తిలేకపోవడం వల్ల సల్మాన్ కన్నుమూశాడు.