ఆక్సిజన్ అందడం కష్టమే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆక్సిజన్ అందడం కష్టమే..

November 30, 2017

ఆక్సిజన్ అందడం కష్టమే..

ఈ నగరానికి ఏమైంది ఓ వైపు పొగ మరోవైపు నుసి…అంటూ సినిమా ఏదైనా రెండు నిమిషాల యాంటీ స్మోకింగ్యాడ్ తప్పకుండా కనిపిస్తుంటుంది. ఆ వాణిజ్య ప్రకటననే సినిమాగా మలచి రెండున్నర గంటల పాటుచూపించాలని అనుకున్నారు దర్శకుడు జ్యోతికృష్ణ. పొగత్రాగరాదు అనే పాయింట్ చుట్టూ ప్రతీకార డ్రామానుఅల్లుకొని ఆక్సిజన్ చిత్రాన్ని తెరకెక్కించారు. 

రఘుపతి(జగపతిబాబు) ఓ పెద్ద వ్యాపారవేత్త. అతడికి వీరభద్రం(షాయాజీషిండే) కుటుంబంతో వ్యక్తిగత తగాదాలుఉంటాయి. రఘుపతి అన్నయ్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేస్తారు. వారు ఎవరో రఘుపతితో పాటు అతడికుటుంబ సభ్యులకు అంతుపట్టదు. దాంతో హంతకుల నుంచి తన వారిని రక్షించుకోవడానికి కుటుంబ సభ్యులెవరు ఇళ్లు దాటి బయట అడుగుపెట్టకుండా జాగ్రత్తపడతాడు రఘుపతి.  రఘుపతి తన కూతురు శృతికి(రాశీఖన్నా)అమెరికాకు చెందిన కృష్ణప్రసాద్(గోపీచంద్) అనే అబ్బాయితో పెళ్లి కుదురుస్తాడు. కృష్ణప్రసాద్  మంచితనానికి శృతితోపాటు రఘుపతి కుటుంబ సభ్యులు కొద్ది రోజుల్లోనే ముగ్ధులవుతారు. అయితే రఘుపతి కుటుంబ సభ్యులనుచంపుతున్న హంతకుడు కృష్ణప్రసాద్ అనే నిజం శృతికి తెలుస్తుంది. కృష్ణప్రసాద్ అసలు పేరు సంజీవ్ అని, అతడోఆర్మీ కమాండర్ అవగతమవుతుంది. రఘుపతి కుటుంబంపై సంజీవ్ శతృత్వం పెంచుకోవడానికి కారణమేమిటి?వారిని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు.  దేశంలో టైగర్ బ్రాండ్ పేరుతో  అక్రమంగా మత్తుపదార్ధాలనుతయారుచేస్తూ ఎంతోమంది మరణానికి కారణమైన ముఠాకు నాయకుడెవరు? సంజీవ్ వారిని ఎలా శిక్షించాడు?సంజీవ్ అమ్మానాన్నలతో పాటు ప్రాణంగా ప్రేమించిన గీత(అను ఇమ్మాన్యుల్) చంపిందెవరు?అన్నదే ఈ చిత్రఇతివృత్తం.

సింపుల్‌గా చెప్పాలంటే తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునే ఓ సైనికుడి కథ ఇది.మూడు ముక్కల్లో పూర్తయ్యే కథను ఎంతలో తీయాలో, ఎలా తీయాలో అనే  క్లారిటీ దర్శకుడికి  లేకపోవడంతో అదికాస్త ప్రేక్షకులకు ఊపిరి అందకుండా చేసేసింది. పల్లెటూరిలోని ఓ ఇంట్లో మొదలైన కథ ఎంతకు అక్కడ నుంచికదలదు. హీరో హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం టీలు, కొబ్బరి బొండాలు  తాగుతూ టైమ్‌పాస్ చేస్తుంటారు.దాంతో పాటు హీరో మంచితనాన్ని చాటడానికి  కథకు సంబంధంలేని త్యాగభరిత సన్నివేశాలతో ప్రథమార్థాన్నినింపేశారు. దాంతో తెరపై ఏం జరుగుతుందో, దర్శకుడు ఏం చెబుతున్నారో అర్థంకాక గజిబిజిగా సినిమాసాగుతుంటుంది. విరామ సన్నివేశాల ముందు వచ్చే మలుపుతో కథ ఆసక్తికరంగా మారుతుందని అనిపిస్తుంది.ద్వితీయార్థంలో దర్శకుడు ఏదో  చెప్పబోతున్నాడని  అనుకుంటే సిగరెట్‌ల పేరిట మత్తుపదార్థాల అక్రమవ్యాపారం, దానికో ఫ్యాష్‌బ్యాక్ చూపించి కథను ముగించేశారు. ఆ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడికిఎందుకుఅనిపించిందో, అందులో ఏముందో అర్థంకాక అయోమయంతో థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకురావడం తప్ప చేసేదేమి ఉండదు. సినిమా కంటే స్మోకింగ్ యాడ్ ఉన్నంతలో బెటర్‌గా అనిపిస్తుంది. జ్యోతికృష్ణసినిమా చేసి పదేళ్లపైనే అయింది. ఆ రోజుల్లో రాసుకున్న కథతోనే ఈ సినిమా చేసినట్లుగా అనిపించింది.  ఈ తరహాకథాంశాలతో తెలుగులో లెక్కకుమించి సినిమాలు వచ్చాయి. కథ పాతదైన కథనాన్ని ఆసక్తికరంగా నడిపించారాఅంటే అది లేదు. కథకుడిగా, దర్శకుడిగా రెండు విభాగాల్లో అతడు విఫలమయ్యారు.  రాక రాకా వచ్చిన ఒక్కఅవకాశాన్ని జ్యోతికృష్ణ పూర్తిగా వృథాచేసుకున్నారు.

కథలో బలం లేకపోవడంతో ఇటీవల కాలంలో హీరోలు, వారికున్న డిజార్డర్స్ ఫార్ములాలు సక్సెస్ కావడంతో ఆబాటలోనూ అడుగులు వేశారు దర్శకుడు. చనిపోయిన అమ్మనాన్నలతో హీరో మాట్లాడే సన్నివేశాలతో కామెడీపండించాలని అనుకున్నారు. అది కాస్తా పంటికిందరాయిలా సినిమా పట్ల ఉన్న కాస్తా ఆసక్తిని పోగొట్టింది. కామెడీ,ఎమోషన్స్, సందేశం సినిమాలో ఏది సరిగా వర్కవుట్ కాలేదు.

హీరోగా మళ్లీ తనకు ఆక్సిజన్‌నిచ్చే సినిమా అవుతుందని గోపీచంద్ పెట్టుకున్న ఆశలేవి ఫలించలేదు. ఈ సినిమాతోఅతడి పరాజయాల లిస్ట్ మరో సంఖ్య పెరిగింది.  ఈ సినిమాను నిలబెట్టడానికి గోపీచంద్ శతవిధాల ప్రయత్నించారు.సినిమా పూర్తి భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. బ్లాక్‌అండ్ వైట్ కాలం నాటి కథ కావడంతో అతడి కష్టంపూర్తిగా వృథానే అయింది. కథల ఎంపికలో అతడు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణప్రసాద్,సంజీవ్‌గా రెండు భిన్న పార్శాల్లో సాగే పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. రాశీఖన్నా, అనుఇమ్మాన్యుయెల్ ఇద్దరుకథానాయకుల పాత్రలను సరిగా ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు. బలమైన ప్రతినాయకుడు లేకపోవడంసినిమాకు మైనస్‌గా నిలిచింది. జగపతిబాబును ైస్టెలిష్‌గా విలన్‌గా పతాక ఘట్టాల్లో రెండు నిమిషాలు చూపిస్తారు.అదేదో ముందునుంచి చూపించిన బాగుండేది. కిక్‌శ్యామ్, బ్రహ్మాజీ, షాయాజీషిండే ఇలా చాలా మంది పాత్రలున్నదేనికి సరైన ప్రాధాన్యత ఉండదు. అలీ, రఘుకారుమంచి నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సాంకేతికంగా సినిమా నాసిరకంగా ఉంది.  సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తీర్చిదిద్దిన గ్రాఫిక్స్ సన్నివేశాలు చిన్నసినిమాల స్థాయిలో ఉన్నాయి.   ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సిన చాలా సన్నివేశాల్ని వదిలేశారు .యువన్‌శంకర్‌రాజా బాణీల్లో ఒక్కటి వినసొంపుగా లేదు. సాంకేకితంగా సినిమాలో ప్లస్‌లకంటే మైనస్‌లే ఎక్కువగాఉన్నాయి.

ప్రేక్షకుల ఓపిక, సహనానికి పరీక్ష పెట్టే చిత్రమిది. భూతద్దం పెట్టి వెదికిన ఇందులో కొత్తదనం మచ్చుకైనాకనిపించదు.  తమ కష్టాలన్ని మరచిపోయి రెండున్నర గంటల పాటు నవ్వుకుందామని థియేటర్‌లో అడుపెట్టినప్రేక్షకుడిని ఉపిరి అందనీయకుండా ఎప్పుడెప్పుడూ బయటకు అడుగుపెడదామా అని ఎదురుచూసేలా చేస్తుంది.

రేటింగ్:2/5