2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్ వేసి భారత్‌ను గెలిపించిన బౌలర్ జోగిందర్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లతోపాటు దేశవాలీ క్రికెట్‌కు కూడా జోగిందర్ గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (bcci) కార్యదర్శికి శుక్రవారం తన రిటైర్మెంట్ లేఖను పంపించాడు. తనకు సహకరించిన బీసీసీఐకి, హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి, హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి జోగిందర్ కృతజ్ఞతలు తెలిపాడు.
కెరీర్‌లో మొత్తం జోగిందర్ నాలుగు టీ20లు, నాలుగు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున జోగిందర్ శర్మ 16 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు. అయితే 2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం కోసం పాకిస్థాన్‌కు ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కావాల్సి ఉండగా బౌలింగ్ చేసిన జోగిందర్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు వరల్డ్ కప్ అందించిన విషాయన్ని క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. తర్వాత జోగిందర్‌కు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయింది. జోగిందర్ శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నారు.