ఆర్సీబీ బోణీ కొట్టింది.. అభిమానులను ఆనందంలో ముంచింది - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్సీబీ బోణీ కొట్టింది.. అభిమానులను ఆనందంలో ముంచింది

April 14, 2019

ఆరంభం నుంచి పరాజయాల పాలవుతున్న ఆర్సీబీ ఎట్టకేలకు విజయం సాధిచింది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. శనివారం పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, డివిలియర్స్‌ సత్తా చాటడంతో 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

2019 Ipl season royal challenger bangalore Win the First match On Kings Xi Punjab.

తొలుత బ్యాటింగ్‌  చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 18 పరుగులు చేయగా.. క్రిస్ గేల్ 99 (నౌటౌట్), మయాంక్ 15, సర్ఫరాజ్ ఖాన్ 15, శామ్ కరన్ 1, మన్దీప్ సింగ్ 18 పరుగులు చేశారు. 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కెప్టెన్ కోహ్లి, డివిలియర్స్ చెలరేగిపోయి ఆడటంతో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. కోహ్లి 67 పరుగులు చేయగా.. డివిలియర్స్‌ 59 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచి జట్టుకు గెలుపు‌నందించారు.