యమహా నుంచి సరికొత్త బైక్.. ధర ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

యమహా నుంచి సరికొత్త బైక్.. ధర ఎంతంటే?

March 15, 2019

ఇండియా యమహా మోటర్ నుంచి మార్కెట్లోకి సరికొత్త బైక్ వచ్చేసింది. ఎంటీ 15 పేరుతో యమహా 155సీసీ బైక్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.36లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ)గా నిర్ణయించింది. అధునాతన ఫీచర్లతో యమహా ఈ బైక్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. లిక్విడ్‌ కూల్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, సింగిల్‌ ఛానల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, వేరియబుల్‌ వ్యాల్యూ ఆక్చుయేషన్‌ ఈ బైక్‌ ప్రత్యేకత.

2019 Yamaha MT-15 launched at Rs 1.36 lakh.

యమహా ఎంటీ సిరీస్ నుంచి ఇప్పటికే పలు మోడళ్లను మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇండియాలో ఎంటీ 09 మోడల్ మాత్రమే విడుదల అయ్యింది. ఈ మోడల్ విక్రయాలు 2015 నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఎంటీ సిరీస్‌లో ఎంటీ -15 బైక్‌ను మర్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఎలాగైన 60వేల ఎంటీ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటర్ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ఇది వర్కౌట్ అయితే.. ఎంటీ -03 బైక్‌లను కూడా భారత్‌లోకి తీసుకురావాలని యమహా భావిస్తోంది.