బీఎండబ్ల్యూ ఎఫర్డ్బుల్ ప్రైస్‌లో సరికొత్త బైక్‌ను భారత మార్కెట్లో శుక్రవారం లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్ఆర్ పేరుతో ఈ సూపర్ బైక్స్ మోడళ్లను విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ మోడల్స్కనునుగుణంగా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్తో ఆకర్షణీమైన రంగుల్లో తీసుకొచ్చింది. ఫీచర్ల విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను వెనుక టెయిల్-ల్యాంప్లలోని బుల్ హార్న్ స్టైల్ LED ఎలిమెంట్స్‌తో పాటు, రీడిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BI-LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ప్రధానంగా ఉన్నాయి.
Reveal your racing attitude with the first-ever BMW G 310 RR. Ex-showroom prices start at INR 2.85 Lakhs. Also available at an attractive EMI of INR 3,999 per month*. #BMWMotorradIndia #BMWMotorrad #BMWG310RR #G310RR #BMWG310RRBookingsOpen #NewLaunch #RevealYourRacingAttitude pic.twitter.com/whJ1QDSoDJ
— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) July 15, 2022
ఈ బైకుకు 313 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, డీఓహెచ్సీ ఇంజిన్‌ను అందిస్తుంది. ఇది 9,700 rpm వద్ద 34 bhpని, 7,700 rpm వద్ద 27 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో ఈ ఇంజిన్ రూపొందించింది. ఈ స్పోర్ట్స్ బైకును కూడా BMW సరసమైన ధరలలో అందుబాటులోకి తెస్తోంది. ఈ బైకు ధర ఎక్స్‌షోరూంలో రూ.2.90 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ లాంచ్‌తో బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా మూడు ఎంట్రీ లెవల్ బైకులను దేశంలోకి తీసుకొచ్చింది. ఈ బైకు ద్వారా భారత్‌లో కంపెనీ మార్కెట్ షేరును మరింత పెంచుకోనుంది.
ఈ బైకు కేటీఎం ఆర్సీ 390, కవాసకి నింజా 300, టీవీఎస్ అపాచే ఆర్ఆర్310లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మోటార్‌సైకిల్ ఎరుపు, నీలం, వంకాయ వంటి రంగులలో లభిస్తుంది.