న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు మందుబాబుల్లో ఫుల్ కిక్ వచ్చేస్తాది. ఏడాది మొత్తం మద్యం దొరకదు ఈ ఒక రోజే తాగేయాలి అన్న రేంజ్ లో రెచ్చిపోతారు. ఫుల్ గా తాగి ఊగుతారు. ఈ సారి కూడా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజలు మందులో మునిగి తేలారు. దీంతో ప్రభుత్వాలకు భారీగా డబ్బులు వచ్చి చేరాయి.
తెలంగాణలో రూ. 215.74కోట్లు
తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్‌కి, బార్లకు ఒంటి గంట వరకు అనుమతులు ఇచ్చారు. దీంతో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్కరోజులోనే 215.74కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. హైదరాబాద్‌లోనే కేవలం 24గంటల్లో 37.68కోట్ల రూపాయల మద్యం తాగేశారు. ఇక 2022లో మద్యంపై రూ.34 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ శాఖ తెలిపింది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్ లో నల్లగొండ జిల్లా ఉంది.
ఏపీలో రూ. 127కోట్లు
తెలంగాణ రేంజ్లో కాకపోయినా ఏపీలో కూడా మద్యం అమ్మకాలు భారీగానే జరిగాయి. డిసెంబర్ 31వ తేదిన మొత్తం రూ.127 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. ఇక్కడ కూడా మద్యం దుకాణాలకు రాత్రి 12గంటల వరకు పర్మిషన్తో పాటు..హోటళ్లు, బార్లకు ఒంట గంట వరకు అవకాశం ఇవ్వడంతో మందుబాబులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాలు మద్యం సేల్స్‌లో ప్రతీ సంవత్సరం కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. వేడుకలతో పేరుతో జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేసి మంచినీళ్లా..మద్యాన్ని తాగేస్తున్నారు.