74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. ఒకరికి పద్మ విభూషణ్, 25 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెరొక పద్మశ్రీ దక్కింది. ఓఆర్ఎస్ ద్రావణాన్ని కనిపెట్టిన వైద్యులు దిలీప్ కుమార్‌కి (పశ్చిమ బెంగాల్) మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. తెలంగాణకు చెందిన బి. రామకృష్ణారెడ్డికి, ఏపీలోని కాకినాడకు చెందిన సుంకురాత్రి చంద్రశేఖర్లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. చినజీయర్ స్వామికి పద్మభూషణ్, సంగీత దర్శకుడు కీరవాణికి పద్మ అవార్డులు వరించాయి. ఎవరెవరికి వచ్చాయో కొందరి వివరాలు చూద్దాం.
రతన్ చంద్రాకర్ – మెడిసిన్ (అండమాన్ నికోబార్)
వీపీ అప్పకుట్టన్ పొడువాల్ – సామాజిక సేవ (కేరళ)
హీరాబాయి లోబి – గిరిజన సంఘసేవకురాలు (గుజరాత్)
వడివేల్ గోపాల్, మసి సదాయ్యన్ – జంతు సంక్షేమం (తమిళనాడు)
రామ్కుయివాంఘ్బే న్యుమె – సాంస్కృతిక సేవ (అస్సాం)