రేకుల షెడ్డుకు 21 కోట్ల కరెంటు బిల్లు - MicTv.in - Telugu News
mictv telugu

రేకుల షెడ్డుకు 21 కోట్ల కరెంటు బిల్లు

March 10, 2022

13

పెచ్చులూడే గోడలున్న రేకుల షెడ్డుకు 21 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చిన సంఘటన తెలంగాణలో జరిగింది. నిర్మల్ జిల్లా సారంగపూర్‌ గ్రామానికి చెందిన అవుజయ్య రేకుల షెడ్డులో నివసిస్తున్నాడు. అందులో టీవీ, ఫ్యాన్, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. ప్రతీ నెలా కరెంటు బిల్లు సాధారణంగా 300 నుంచి 400 రూపాయల మధ్య వస్తుంది. కానీ ఈ నెల మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మీటర్ బిల్లింగ్ తీసే వ్యక్తి ఎప్పటిలాగే మీటర్ స్కాన్ చేసి బిల్లు తీసి చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అది చూసిన అంజయ్య అందులో ఏకంగా రూ. 21,47,48,364 ఉండడం చూసి కరెంట్ ఆఫీసుకు పరిగెత్తాడు. బిల్లు చూసిన అధికారులు మొదట షాకయ్యి, తర్వాత సాంకేతిక లోపంతో జరిగుంటుందని భావించి, అవుజయ్యకు మరో బిల్లు తీసిచ్చారు. దాంట్లో ప్రతీనెలా మాదిరే బిల్లు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.