21 km solar roof cycle track in Hyderabad
mictv telugu

హైదరాబాదులో 21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్

August 11, 2022

ఫారిన్ కంట్రీల్లో కనిపించే సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ త్వరలో హైదరాబాదులో అందుబాటులోకి రానుంది. పైలెట్ ప్రాజెక్టుగా మొదట కోకాపేటలో అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీనిని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఓఆర్ఆర్ వెంబడి 21 కిలోమీటర్ల మేర ఇదే నమూనాను నిర్మిస్తామని వెల్లడించారు. ఓఆర్ఆర్, సర్వీసు రోడ్డు మధ్యలో ఈ సైకిల్ ట్రాక్ ఉండనుంది. ట్రాక్ నిర్మాణం, సోలార్ ప్యానెల్ ఏర్పాటు తదితర పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. సోలార్ రూఫ్ వల్ల సైకిలిస్టులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించడమే కాకుండా ఏటా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ట్రాక్ వెంబడి ఫుడ్ కోర్టులు, తాగునీరు, సైకిల్ రిపేర్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ట్రాక్ మీద ఏర్పాటు చేసే లైటింగ్‌తో పాటు ఓఆర్ఆర్‌పై డ్రిప్ ఇరిగేషన్, వీధిలైట్లకు వినియోగించనున్నారు. ఇది సక్సెస్ అయితే నగరంలో మరిన్ని సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.