21 ఏళ్లకే హైకోర్టు జడ్జి.. దేశంలోనే తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

21 ఏళ్లకే హైకోర్టు జడ్జి.. దేశంలోనే తొలిసారి

November 21, 2019

దేశ చరిత్రలోనే తొలిసారి న్యాయవ్యవస్థలో ఆసక్తిక సన్నివేశం చోటు చేసుకుంది. కేవలం 21 ఏళ్ల వయసున్న యువకుడు హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా మయాంక్ ప్రతాప్ సింగ్‌కు ఈ అవకాశం దక్కింది. ఎంతో అనుభవం ఉన్నవారే ఎంపిక అయ్యే ఈ పోస్టుకు మయాంక్ కేవలం ఒకేసారి పరీక్ష రాసి ఎంపిక కావడం విశేషం. దీంతో అతిచిన్న వయస్సులోనే హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన వ్యక్తిగా రికార్డు సాధించాడు. 

Judge in Country.

మనస సరోవర్‌కు చెందిన మయాంక్ రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్ 2018 పరీక్షలకు హాజరై అందులో అర్హత సాధించాడు. ఫలితాలు రావడంతో అతి చిన్న వయస్సులోనే జడ్జిగా అవతరించాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజస్థాన్ యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పొందాడు. ఆ వెంటనే ఆయనకు ఈ అవకాశం దక్కింది. న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించేందుకు తాను ప్రతిరోజూ కనీసం 12 నుంచి 13 గంటలు ప్రాక్టీస్ చేసినట్టు మయాంక్ చెబుతున్నారు.  

తన బాధ్యతలు మంచిగా నిర్వర్తించడమే తన ముందు ఉన్న లక్ష్యమని చెబుతున్నారు. కాగా రాజస్థాన్ జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు గతంలో కనీస వయస్సు 23 సంవత్సరాలు ఉండేది. కానీ దీంట్లో మార్పులు చేసి 21 ఏళ్లకు కుదించారు. దీంతో మయాంక్‌కు ఈ అరుదైన అవకాశం దక్కింది. చిన్న వయస్సుల్లోనే హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. త్వరలోనే అతడు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.