తెలంగాణలో వెయ్యికి చేరిన కరోనా మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో వెయ్యికి చేరిన కరోనా మరణాలు

September 17, 2020

nfgn

తెలంగాణ రాష్ట్రంలో మరో 2,159 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 9 మంది కరోనా వైరస్ సోకి మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1005కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,108 మంది కోలుకున్నారు. 

దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,33,555కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న 53,094 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 23,29,316కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేట్ 80 శాతం ఉంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.