ఇండియాకు చేరుకున్న 219 మంది విద్యార్థులు - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాకు చేరుకున్న 219 మంది విద్యార్థులు

February 26, 2022

మూడు రోజుల నుంచి ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా తమ పిల్లలు ఉక్రెయిన్‌లో అనేక అవస్థలు పడుతున్నారు. వారిని సురక్షితంగా ఇండియాకి తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు, తెలుగు రాష్ట్రాల నాయకులు కోరిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి శనివారం ఉక్రెయిన్‌కు విమానాలను పంపించింది. ఈ నేపథ్యంలో 219 మంది భారతీయ విద్యార్థులతో తొలి భారతీయ విమానం బయలుదేరింది.

అందుబాటులో ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకుంటూ యుద్ధ‌ భూమిలో చిక్కుకున్న భార‌తీయుల్లో 219 మందిని విమానం ఎక్కించేసింది. విమానం అక్క‌డి నుంచి ముంబైకి టేకాఫ్ కూడా తీసుకుంది. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఫొటోల‌ను కూడా విడుద‌ల చేశారు.

మరోపక్క భార‌త విదేశాంగ శాఖ సూచ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు చేరుకున్న 219 మంది భార‌తీయుల‌ను విద్యార్థులను ముంబైకి పంపించారని తెలిపారు.ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయులు అంద‌రినీ సుర‌క్షితంగా దేశానికి తీసుకువ‌చ్చేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న‌ట్లుగా ఆయన పేర్కొన్నారు.