ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక ఉంటుంది. మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈ రోజుకు కొన్ని ప్రాముఖ్యతలున్నాయి. చరిత్రలో ఈ రోజు ఎలా నిలిచిపోయిందో తెలుసుకోవాలంటే ఇది చదువండి. చాలామందికి ఫిబ్రవరి 22 ఒక తేదీ మాత్రమే. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకునే రోజు కూడా. కస్తూరీ భా గాంధీ చనిపోయిన రోజు ఈ రోజే. అలాగే ఆటలకు సంబంధించి, క్లోనింగ్ కు సంబంధించి కూడా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. అలాంటి కొన్ని సంఘటనల సమాహారమే ఈ కథనం..
1944
మహాత్మాగాంధీ సతీమణి కస్తూర్భా గాంధీ 22 ఫిబ్రవరి 1944న తుది శ్వాస విడిచారు. గాంధీతో కలిపి ఆమె బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె 1930ల్లో అనేక శాసనోల్లంఘన ప్రచారాల్లో పాల్గొంది. అంతేకాదు.. అనేకసార్లు అరెస్టు అయి జైలుపాలయింది. పుణేలోని అగాఖాన్ ప్యాలెస్ లో ఖైదు చేసినప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఆమె మరణించింది.
1980
సోవియట్ యూనియన్ ఐస్ హాకీ జట్టు అంటే అందరికీ ఇష్టం. ఇది 1980 నాటి ఒలింపిక్స్ సంగతి. అయితే ఈ జట్టు యునైటెడ్ స్టేట్స్ తో తలపడి సెమీ ఫైనల్ లో 4-3 స్కోరుతో ఓడిపోయింది. ఇది చరిత్రలో హాకీ అభిమానులకు పెద్ద అప్ సెట్ డే అని చెప్పొచ్చు. ఇక యూఎస్ పురుషుల ఐస్ హాకీ జట్టు ఫైనల్ లో ఫిన్ లాండ్ ను 4-2తో ఓడించి టోర్నమెంట్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
1997
డాలీ అనే గొర్రెను క్లోనింగ్ పద్ధతి ద్వారా ఈ భూమ్మీదకు వచ్చింది. ఇలా పుట్టిన మొదటి క్షీరదం అయింది. సైన్స్ లో అసాధ్యం అనుకున్న ఈ ఫీట్ 22 ఫిబ్రవరి 1997న డబ్లిన్ సమీపంలోని రోస్లిన్ ఇనిస్టిట్యూట్ లో జరిగింది. స్వయంగా అక్కడి శాస్త్రవేత్తలు ఈ విషయం ప్రకటించారు. ఇయాన్ విల్మట్ పర్యవేక్షణలో ఈ డాలీ పుట్టింది.
2011
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో ఐదు నెలల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. కానీ ఈ రోజు వచ్చిన భూకంపంతో ఆ ప్రాంతమే అతలాకుతలమైంది. 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం నగరం, దాని పరిసర ప్రాంతాల్లో చాలా విధ్వంసం సృష్టించింది. ఉపరితలమంతా పగుళ్లకు దారి తీసింది.
2014
22 ఫిబ్రవరి 2014న ఉక్రెయిన్ పార్లమెంట్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ను గద్దె దించడానికి ఓటు పడింది. యనుకోవిచ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అనుకూలంగా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఇది జరిగింది. దీంతో ఆయన ప్రభుత్వం పై సర్వత్రా నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఆ తర్వాత యనుకోవిచ్ దేశం విడిచి పారిపోయాడు.