ఇటీవల శంషాబాద్ లో భారీ ఫుల్ఫిల్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేసిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో శుభవార్త చెప్పింది. దీపావళి, దసరా పండుగల్లో పెరిగే అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో 22 వేల సీజనల్ ఉద్యోగాలను కల్పించింది. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ఈ ఉద్యోగాలు ఇవ్వనుంది. తమ ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్ సర్వీసు సైట్లలో ఈ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ చెప్పింది. ఈ సీజనల్ ఉద్యోగాల వల్ల తమ కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలను అందజేస్తామని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా అకిల్ సక్సేనా వెల్లడించారు. 41 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 15 సోర్టేషన్ సెంటర్లు, 150 డెలివరీ స్టేషన్లలో ఉద్యోగాలు ఇస్తామని, వీరు సరుకులను పిక్ చేసుకుని, ప్యాకే చేసి, రవాణా చేసి, కస్టమర్లకు అందిస్తారని తెలిపారు.