2,200-Year-Old Flush Toilet Found in China Likely One of The Oldest Ever Discovered
mictv telugu

రెండువేల ఏళ్ల కిందటే.. ఫ్లష్ టాయిలెట్

February 20, 2023

2,200-Year-Old Flush Toilet Found in China Likely One of The Oldest Ever Discovered

చైనాలో అత్యంత పురాతన టాయిలెట్ దొరికింది. అది కూడా ఫ్లష్ టాయిలెట్. ఇది చాలా పురాతనమైనది అని చెబుతున్నారు దాన్ని తవ్వి తీసిన ఆర్కియాలజిస్టులు. సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాల కిందటదని చెబుతున్నారు.

చైనాలోని యుయాంగ్ సిటీలో పెద్ద బిల్డింగ్ లను రెండింటిని తవ్వుతుంటే ఈ టాయిలెట్ బయటపడింది. చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఈ తవ్వకాలను చేపట్టారు. తవ్వకాల్లో దొరికిన ఫ్లష్ టాయిలెట్ 2,200 నుంచి 2,400 ఏళ్ళ కిందటి వారింగ్ స్టేట్స్ పీరియడ్ లోనిది అని, హాన్ డైనస్టీ మొదట్లో దీన్ని వాడి ఉంటారని చెబుతున్నారు. అయితే దీన్ని తయారు చేసింది, కనిపెట్టింది మాత్రం విక్టోరియన్ ఇంగ్లాండ్ వాళ్ళు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు.

అంత పాత టాయిలెట్ అయినా దానిలో నీరు వెళ్ళే విధానం నేటి యుగానికి సంబంధించిన వాటిల్లానే ఉందని ఎన్షియంట్ టూల్స్ డిజైన్ చేసే ఫాన్ మింగ్యాంగ్ చెబుతున్నారు. వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధునాతనంగా ఉందని అంటున్నారు. టాయిలెట్ బౌల్, పైప్, మరికొన్ని విరిగిన పార్ట్స్ తవ్వకాల్లో దొరికాయి. ఈ టాయిలెట్ ను చైనాలోని ధనవంతులు ఉండే షాంక్సీ ఫ్రావిన్స్ లో దీన్ని వాడి ఉంటారని అంచనా వేస్తున్నారు.

టాయిలెట్ బౌల్ ని వాడిన ప్రతీసారి సర్వెంట్స్ అందులో నీళ్ళు వేసి ఉంటారని చెబుతున్నారు. చైనాలో ఇదే మొట్టమొదటి టాయిలెట్ అయి ఉంటుందని అంటున్నారు. ఇలా భూమిలోపల దొరికిన టాయిలెట్ కూడా ఇదే మొదటిదని వివరించారు. దీని మీద పరిశోధనలు చేస్తే అప్పటి ఆహారపు అలవాట్లు కూడా తెలుస్తాయని చెబుతున్నారు.