23 నుంచి పేటీఎం బ్యాంకు - MicTv.in - Telugu News
mictv telugu

23 నుంచి పేటీఎం బ్యాంకు

May 17, 2017

ఈ వాలెట్‌ దిగ్గజం పేటీఎం బ్యాంకు మే 23 నుంచి బ్యాంక్ గా మారుబోతోంది. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు ఆర్‌బీఐ తుది అనుమతులుఇచ్చింది. . ఈ బ్యాంకు లైసెన్స్‌ విజయ శేఖర్‌ శర్మ పేరుతో మంజూరైంది.దీంతో కంపెనీ తన ఈ వాలెట్‌ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది.
పేటీఎంకు ఇప్పటికే 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్‌ పీపీబీఎల్‌లో భాగమవుతుంది. ఒక వేళ వినియోగదారులకు ఈ విషయం ఇష్టం లేనట్లైతే పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వాలెట్లోని బ్యాలెన్స్‌ వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంది.
ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్‌లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్‌లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్‌ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.

HACK:

  • PayTm  Starts its Banking services from this May 23