23.8 percent unmarried in Telangana: Centre
mictv telugu

ఒక్క తెలంగాణలోనే 23.8 శాతం మంది ఉన్నారు: కేంద్రం

July 8, 2022

తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకొని యువతీ, యువకుల సంఖ్య 23.8 శాతంగా ఉందని ”భారత్‌లో యువత 2022″ అనే పేరిట తాజాగా కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు పలు అంశాలతో కూడిన సర్వే నివేదికను విడుదల చేశారు. 30 ఏళ్లు మీద పడినా కూడా వాళ్లు వివాహం వైపు దృష్టి సారించడం లేదని, దేశం మొత్తమ్మీద ఇదే ధోరణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

”భారత్‌‌లో 29 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోనివారు 2011లో 20.8 శాతం మంది ఉండగా, 2019లో ఇది 28.1 శాతానికి పెరిగింది. తెలంగాణలో గడచిన అయిదేళ్లతో పోల్చితే పెళ్లీడు దాటిపోయే వారి సంఖ్య దాదాపు 2 శాతం పెరిగింది. 2015లో రాష్ట్రంలో 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోని వారు 21.5 శాతం మంది ఉండగా, 2019లో ఏకంగా 23. 8 శాతానికి పెరిగింది. దేశంలో ప్రధానంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు అధికంగా నమోదయ్యారు. వయసు దాటిపోవడం వల్ల వైవాహిక జీవితంపై దుష్పభావం పడడమే కాకుండా, పుట్టే పిల్లల్లోనూ సమస్యలు ఎదురవుతాయి” అని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు ఇవే..

1. 2021లో 15-20 ఏళ్ల మధ్య వయస్కులు దేశ జనాభా (196.3 కోట్లు)లో 27.3 శాతం మంది. 2030 నాటికి ఈ యువత శాతం 22.7కు తగ్గుతుంది.
2. తెలంగాణలో ఇది 20.4 శాతం నుంచి 21.7 శాతానికి తగ్గుతుంది. 2021 గణాంకాల ప్రకారం.. దేశ సగటు యువత రేటుతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో యువత రేటు తక్కువగా ఉంది.
3. నెలసరి సమయంలో పరిశుభ్రమైన పద్ధతులను పాటిస్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది. 15-24 ఏళ్ల వారిని పరిగణనలోకి తీసుకుంటే, 2015-16లో 58 శాతం మంది ఈ పద్ధతులను అనుసరిస్తుండగా, 2019-21లో ఆ శాతం 77. 0కు పెరిగింది. గ్రామీణ భారతంలో వీరి శాతం 2015-16లో 48.2 కాగా, 2019-21లో 72.6 శాతానికి పెరిగింది. దేశంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2005-06లో 11.0 శాతం మంది. 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోగా, 2019-21లో వీరి సంఖ్య 1.1 శాతానికి తగ్గింది.
4. బాల్య వివాహాల వల్ల అమ్మాయిల ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. రక్తహీనత వేధిస్తోంది. పుట్టిన శిశువుల ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటోందని నివేదిక వెల్లడించింది.