లండన్‌లో తెలంగాణ బీజేపీ నేత కొడుకు మృతి
లండన్‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లి అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నే శ్రీహర్ష కథ విషాదాంతమైంది. లండన్‌లోని ఒక బీచ్‌లో ఈరోజు గుర్తు తెలియని మృతదేహం లభించింది. ఆ మృతదేహం గురించి స్థానిక పోలీసులు శ్రీహర్ష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద దొరికిన దుస్తులు, పర్సు, బ్యాగ్ చూసిన ఆయన తండ్రి మృతదేహాన్ని శ్రీహర్షదిగా గుర్తించారు.
గత నెల 21న శ్రీహర్ష లండన్‌లో అదృశ్యం అయ్యాడు. 12 రోజులుగా శ్రీహర్ష ఆచూకీ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నట్టుగా లండన్ పోలీసులు నిర్ధారించారు. శ్రీహర్ష తండ్రి పేరు ఉదయ్ ప్రతాప్ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు ప్రతాప్ ఇంటికి చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు తెప్పించే ఏర్పాట్లు చేస్తామని, రాష్ట్ర నాయకులు ఆయనకు హామీ ఇచ్చారు.