కరోనా వైరస్ చిన్న పెద్దా తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ఎందరో చిన్నారులు కరోనా బారినపడ్డారు. తెలంగాణలో కూడా ఎందరో చిన్నారులు కరోనా బారిన పడి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 23రోజుల పసికందు కూడా ఉండడం బాధాకరం. అయితే, ఈరోజు ఆ 23 రోజుల పసికందుతో పాటు 13 మంది చిన్నారులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ నెల 10న మహబూబ్ నగర్ జిల్లా మర్లు గ్రామంకి 23చెందిన రోజుల చిన్నారికి విరోచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ బాబుకి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని రావడంతో గాంధీకి తరలించి వైద్య చికిత్సలు అందజేశారు. ఈరోజు ఆ బాబు క్షేమంగా తల్లి వడికి చేరాడు. ఈ చిన్నారితో పాటు 13 మంది పిల్లలు కరోనాను జయించి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు గాంధీ వైద్యులు అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు.