24 Female Students Suspended For Demanding To Wear Hijab
mictv telugu

కాలేజీ నుంచి 24 మంది విద్యార్థినుల సస్పెన్షన్‌.. అదే కారణం

June 7, 2022

కర్నాటకలో హిజాబ్‌ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్‌ గ్రేడ్‌ కాలేజీ యాజమాన్యం హిజాబ్‌ ధరించి వచ్చిన 24మంది విద్యార్థినుల్ని తరగతులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. వారిని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

వాస్తవానికి హిజాబ్ వివాదం కారణంగా.. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు యూనిఫార్మ్ తప్పనిసరి చేశారు. అయినప్పటికీ విద్యార్థినులు యూనిఫాంలో కాకుండా హిజాబ్‌లో వచ్చారని, అందుకే వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. విద్యాసంస్థల్లో హిజాబ్ లు, కాషాయ కండువాలు ధరించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిప్పటికీ బాలికలు హిజాబ్ ధరించాలని పట్టుబట్టారు.

హిజాబ్ వివాదం కారణంగా చాలా మంది విద్యార్థులు హిజాబ్ అనుమతి ఉన్న కాలేజీలకు మారిపోతున్నారని, పెద్ద ఎత్తున ట్రాన్స్‌పర్లు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు కూడా సహకరిస్తున్నాయట. హిజాబ్ ధరించేవారు టీసీ తీసుకొని వెళ్లొచ్చని కాలేజీలే చెప్తున్నాయని అంటున్నారు.