24 గంటల విద్యుత్ సరే కానీ రైతును నడిపించే ప్రణాళికేది ? - MicTv.in - Telugu News
mictv telugu

24 గంటల విద్యుత్ సరే కానీ రైతును నడిపించే ప్రణాళికేది ?

August 7, 2017

24 గంటలు విద్యుత్ ఇస్తామంటుంటే సంగారెడ్డి జిల్లా రైతులు వద్దంటున్నారు. కారణం వర్షాలు సరిగ్గా లేకపోవడం ఒకటైతే, 24 గంటలు కొన్ని మోటార్లు అదే పనిగా నడవటం ఒక కారణం అంటున్నారు. డే అండ్ నైటు నడిచినోళ్ళ మోటార్లే నడిస్తున్నాయి. అందువల్ల ఇతర బోరు మోటార్లలోని భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఒక మోటార్ ఎఫెక్టు ఇంకొక మోటార్ మీద పడుతోంది. మోటార్లు కూడా చీటికీ మాటికీ కాలిపోతుండటంతో రైతులు వాటిని బాగు చేయించడానికి డబ్బుల్ని దుబారా చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది ? 24 గంటల విద్యుత్ తో శివారంతా పచ్చగా మెరవాలనుకున్న విద్యుత్ అధికారుల అంచనా తారుమారైంది. అక్కడక్కడా ఒకటీ అరా తప్పితే పొలాలన్నీ పచ్చగా వుండట్లేదు. రైతులందరూ ఈ 24 గంటల విద్యుత్ అవసరం లేదంటున్నారు.

అధికారులు 24 గంటలు కరెంటిచ్చామని చంకలు గుద్దుకోగానే సరిపోదు కదా ? దానికి తగ్గ ప్రణాళిక కావాలి. మోటార్లు ఎంత సేపు నడవాలి, వాటికి ఎంతసేపు రెస్టు ఇవ్వాలి అనే ప్లానింగు లేకుండా కరెంటిచ్చాము తన్నుకు చావండన్నట్టే వుంది కత అని అనుకున్నట్టున్నారు రైతులంతా. నిజమే అధికారులు కూడా ఉదారంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నామని కాకుండా దానికి ముందే రైతులకు ఎలాంటి పంటలు వేస్కోవాలి, ఎంత మోతాదులో నీరు వాడాలి, ఒక్కొక్క మోటార్ ఎంత సేపు నడవాలి.., వంటివి ముందే ఒక ఐడియాలజీతో చెప్పుంటే ఫలితం వేరేలాగుండేది. కానీ అధికారులు అక్కడే ఫెయిలయ్యారేమో. ఆకలున్నోడికి కడుపు నిండా అన్నం పెట్టాలి కానీ కడుపు నిండాక్కూడా కింద పారబోసేలా పెట్టకూడదు కదా ? అచ్చు అలాగే వుంది విధ్యుత్ అధికారుల పనితీరు చూస్తుంటే !?