సిద్ధరామయ్య కేబినెట్లోకి మరో 24 మంది మంత్రులు
బెంగళూరు : కర్నాటక సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని విస్తరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఈ నెల 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య తాజాగా మరో 24 మంది ఎమ్మెల్యేలను తన కేబినెట్లోకి తీసుకున్నారు. వారితో గవర్నర్ థావత్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో కలుపుకొని సిద్దూ కేబినెట్లో మంత్రుల సంఖ్య 34కు చేరింది.
సిద్ధూ మంత్రివర్గంలో చేరిన వారిలో హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరెగౌడ, దినేశ్ గుండూరావు, క్యాథసంద్ర ఎన్. రాజన్న, దర్శనపూర్ శరనబసప్ప, శివానంద్ పాటిల్, ఎన్ చలువరాయ స్వామి, కే వెంకటేశ్, డా.హెచ్‌సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖంద్రే, తిమ్మాపూర్ రామప్ప బాలప్ప, ఎస్‌ఎస్ మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, డా. శరనప్రసాద్ రుద్రప్ప పాటిల్, మంకాల్ వైద్య, లక్ష్మీ హెబ్బాల్కర్, రహీమ్ ఖాన్, డీ సుధాకర్, సంతోష్ ల్యాడ్, ఎన్‌ఎస్ బోసెరాజు, సురేష బీఎస్, మధు బంగారప్ప, డా.ఎంసీ సుధాకర్, బీ నాగేంద్ర ఉన్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా వారికి ఇప్పటి వరకు శాఖలు కేటాయించలేదు. తాజాగా మరో 24 మందితో కేబినెట్ విస్తరించినందున అందరీకి ఒకేసారి శాఖలు కేటాయించే ఛాన్సుంది.
Karnataka Cabinet expansion | Bengaluru: Congress leaders N Chaluvarayaswamy, K Venkateshtake, Dr HC Mahadevappa Eshwar Khandre take oath as Karnataka Minister pic.twitter.com/haQRJFsrZH
— ANI (@ANI) May 27, 2023