24 people were treated at Sarojini Hospital for burn injuries during Diwali celebrations
mictv telugu

దీపావళి వేడుకల్లో అపశృతి.. హాస్పిటల్ ముందు భారీ క్యూ

October 25, 2022

24 people were treated at Sarojini Hospital for burn injuries during Diwali celebrations

హైదరాబాద్ పరిసరాల్లో వెలుగుల్ని విరజిమ్మిన దీపావళి వేడుకలు పలువురికి చీకటినింపాయి. బాణాసంచా, టపాకాయలు పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించని చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బాణాసంచా సమయంలో ముఖంపై కాలిన గాయాలతో కంటిచూపుపై ప్రభావం చూపాయి. పండుగ వేళ బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు నగరంలోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు.

దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు హైదరాబాద్‌లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు. వయసుతో సంబంధంలేకుండా చిన్నారులనుంచి , వృద్ధులు సైతం జాగ్రత్తలు పాటించకుండా బాణాసంచా, టపాకాయలు పేల్చి గాయపడ్డారని సమాచారం. మొత్తం 24 మంది గాయపడ్డారని.. వారికి చికిత్స అందించినట్లు సరోజినీదేవీ కంటి హాస్పిటల్ డాక్టర్ వసంత తెలిపారు. 17 మంది బాధితులను సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బాధితుల్లో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉందని.. అందులో ముగ్గురిని వేరే ఆసుపత్రికి పంపించామని తెలిపారు. గాయపడినవారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.