248 crore jackpot...but not told to wife and children.
mictv telugu

248 కోట్ల జాక్ పాట్…కానీ భార్యా, పిల్లలకూ చెప్పలేదు.

November 1, 2022

బోలెడు డబ్బులు వచ్చాయి….కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. చివరకు కట్టుకున్న భార్యకు, కన్న పిల్లలకూ కూడా. లాటరీలో తగిలిన డబ్బులు తీసుకోవడానికి కూడా జోకర్ వేషంలో వెళ్ళాడు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా…ఇది నిజంగా జరిగింది. చైనాలో ఓ వ్యక్తికి లాటరీలో 30 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. అంటే అక్షరాలా 248 కోట్లు. అంత డబ్బు…చూడగానే ముందు మతి పోతుంది. తరువాత ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. కుటుంబసభ్యులతోనే కాదు తనకు తెలిసిన వాళ్ళందరితోనూ చెప్పుకుంటారు. కానీ అతను మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. అసలు డబ్బులు వచ్చినట్టే ప్రవర్తించలేదుట. కారణం ఏంట్రా అంటే అంత డబ్బు తన భార్యా పిల్లలను మార్చేస్తుందని అంటున్నాడు. డబ్బు మనుషులను సోమరులుగా, అహంకారులగా మార్చేస్తుందిట.

చైనాలోని గ్వాంగ్ జి జువాంగ్ ప్రాంతానికి చెందిన 80 యువాన్లు అంటే 11 డార్లు పెట్టి 40 లాటరీ టికెట్లు కొన్నాడు. దాంట్లో అతనికి జాక్ పాట్ తగిలింది. అందులోనే కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. అక్టోబర్ 24న ప్రైజ్ మనీ కూడీ తీసుకున్నాడు. కానీ దాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా కార్టూన్ వేషం వేసుకుని మరీ వెళ్ళాడుట. ఇంత డబ్బు వచ్చిందని తెలిస్తే తన భార్యా పిల్లలు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారని అతని ఆందోళనట. డబ్బు ఉంది కదా అని కష్టపడి పని చేయడం, చదువుకోవడం మానేస్తారని చెప్తున్నాడుట.

లాటరీలో 30 మిలియన్ డాలర్లు గెలుచుకున్నప్పటికీ విజేత చేతికి మాత్రం 24 మిలియన్లే వచ్చాయి. అందులో 5 మిలియన్లు అతను విరాళంగా ఇచ్చేయగా మిగతావి టాక్స్ ల కింద పోయాయి.

లాటరీ టికెట్లు కొనడం తన హాబీ అని చెబుతున్నాడు విజేత. పదేళ్ళుగా తాను లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నానని తెలిపాడు. లాటరీ మీద తాను చాలా హోప్స్ పెట్టుకున్నానని…కానీ ఇవేవీ తన కుటుంబానికి తెలియదని చెబుతున్నాడు. వచ్చిన డబ్బుతో ఏం చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని అంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత నిర్ణయిస్తానని….అప్పడు కూడా తన భార్యా పిల్లలతో చెప్తానా లేదా అనేది తెలియదని అంటున్నాడు.